మయన్మార్‌ చేతికి భారత జలాంతర్గామి!
మయన్మార్‌ చేతికి భారత జలాంతర్గామి!

దిల్లీ: దక్షిణాసియా దేశాల్లో తన సైనిక ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా దీటుగా స్పందిస్తోంది. మయన్మార్‌ నౌకా దళానికి ఒక జలాంతర్గామిని ఇవ్వాలని నిర్ణయించింది.
మయన్మార్‌ నౌకాదళంలో ఇదే తొలి జలాంతర్గామి అవుతుంది. కొన్నేళ్లుగా ఇరు దేశాల నౌకాదళాల మధ్య సహకారం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ‘‘కిలో తరగతికి చెందిన ఐఎన్‌ఎస్‌ సింధువీర్‌ అనే జలాంతర్గామిని మయన్మార్‌కు ఇవ్వనున్నాం. ఈ ప్రాంతంలో అన్ని దేశాల భద్రత, వృద్ధి కోసం మనం చేపట్టిన ‘సాగర్‌’ దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. పొరుగు దేశాల స్వయం సమృద్ధి, సామర్థ్య పెంపునకు చర్యలు చేపడతాం’’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం తెలిపారు. కిలో తరగతి జలాంతర్గామి.. డీజిల్‌-విద్యుత్‌తో పనిచేస్తుంది. శత్రువుపై మెరుపు దాడి చేసేందుకు ఇది అక్కరకొస్తుంది.

Tags :

మరిన్ని