అమెరికా, సింగపూర్‌లో తెలుగు సాహిత్య సమ్మేళనాలు
అమెరికా, సింగపూర్‌లో తెలుగు సాహిత్య సమ్మేళనాలు

హ్యూస్టన్‌: అమెరికాలోని హ్యూస్టన్‌లో తొలిసారిగా అంతర్జాతీయ తెలుగు సాహిత్య సమ్మేళనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జులై 4న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతోందని ప్రముఖ సాహితీవేత్త వంగూరి చిట్టెన్‌ రాజు తెలిపారు. సిలికాన్‌ వ్యాలీ నివాసి, ప్రముఖ సాహితీవేత్త శారద కాశీవఝ్ఝల ఆధ్వర్యంలో ‘నభూతో అంతర్జాల అంతర్జాతీయ ద్యయాహ్న సాహితీ సదస్సు’ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సాహితీవేత్తలు ఇందులో పాల్గొంటున్నట్లు చిట్టెన్‌ రాజు తెలిపారు. సింగపూర్‌లో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ రత్నకుమార్‌ ఆధ్వర్యంలో ‘శ్రీ సాంస్కృతిక కళా సారథి’ సంస్థ వారు అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, ముఖ్య అతిథిగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, గౌరవ అతిథిగా చిట్టెన్‌ రాజు హాజరవుతున్నారు. వీటికి సంబంధించిన ప్రసంగాల్ని యూట్యూబ్‌లో వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు.


మరిన్ని