హెచ్‌-1బీ వీసాల నిలిపివేత?
హెచ్‌-1బీ వీసాల నిలిపివేత?

అమెరికాలో ఇప్పటికే ఉన్నవారికి మినహాయింపు

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో తాత్కాలికంగా పని చేయడానికి అవసరమయ్యే హెచ్‌-1బీ, ఎల్‌ 1 తదితర వీసాల నిలుపుదలపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేయనున్నారని సమాచారం. దీనిలో కొన్ని మినహాయింపులనూ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. హోటళ్లలో, నిర్మాణ రంగంలో కొన్నాళ్లపాటు పనిచేసే నిమిత్తం అమెరికాకు వచ్చేవారికి జారీ చేసే హెచ్‌-2బి వీసాలు, పరిశోధకులకు ఇచ్చే జె-1 వీసాలనూ నిలిపివేసేలా ఉత్తర్వులు ఇస్తారని తెలుస్తోంది.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని