కువైట్‌లో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు
కువైట్‌లో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. కువైట్‌ తెలుదేదశం అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు ఆధ్వర్యములో ఈ వేడుకలు జరిగాయి. అక్కడ కూడా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి ఈ సందర్భంగా సాయం చేశారు. సాల్మియా, ఒమేరియా, అబు హలిఫా, సబాహియా, ఫహాహీల్, మంగాఫ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారికి రేషన్‌ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అభిమానులందరూ జూమ్‌ ద్వారా ఒకరినొకరు ముచ్చటించుకున్నారు. రైల్వే కోడూరు తెలుగుదేశం నాయకులు పంతగాని నరసింహప్రసాద్, ఎన్నారై  టీడీపీ కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ తదితరులు అభిమానులతో మాట్లాడారు. గాయకుడు ప్రవీణ్ కుమార్ బాలకృష్ణ, ఎన్టీఆర్‌ పాటలను పాడి అలరించారు.


మరిన్ని