మాంచెస్టర్‌లో ఘనంగా బాలకృష్ణ బర్త్‌ డే వేడుకలు
మాంచెస్టర్‌లో ఘనంగా బాలకృష్ణ బర్త్‌ డే వేడుకలు

మాంచెస్టర్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు యూకేలోనూ ఘనంగా జరిగాయి. మాంచెస్టర్‌లో తమ అభిమాన నటుడి 60వ జన్మదిన వేడుకలను ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో అభిమానులు ఉత్సాహంగా జరుపుకొన్నారు. కరోనా విజృంభణ వేళ భౌతికదూరం నిబంధనలను పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీలోని తమ నియోజకవర్గాల్లో తెదేపాకు, చంద్రబాబుకు మద్దతుగా పనిచేస్తామంటూ వారంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కేకు కోసి బాలయ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో భీం, వంశీ, రూపేశ్‌, ఆనంద్‌, ప్రదీప్‌, దినేశ్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


మరిన్ని