అమెరికాలో ఘనంగా బాలకృష్ణ బర్త్‌ డే వేడుకలు
అమెరికాలో ఘనంగా బాలకృష్ణ బర్త్‌ డే వేడుకలు

60 నగరాల్లో 60 కేకులతో వినూత్నంగా.. 

అమెరికా‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలోనూ ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులందరినీ ఏకం చేస్తూ ప్రవాస భారతీయుడు కోమటి జయరాం చేసిన వినూత్న ప్రయత్నం విజయవంతమైంది. తమ అభిమాన నటుడు 60వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు 60 నగరాల్లో 60 కేకులు కట్‌ చేసి వైవిధ్యభరితంగా వేడుకలు జరుపుకొన్నారు. తద్వారా బాలకృష్ణ పట్ల తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు.  

ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ.. బే ఏరియాతో బాలయ్యకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఇక్కడ గతంలో రెండు సార్లు ఆయన తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులందరి సమక్షంలో ప్రత్యక్షంగా జరుపుకొన్నారని గుర్తు చేసుకున్నారు.  కరోనా సమయంలో అమెరికా ప్రభుత్వం విధించిన నిబంధనల్ని పాటిస్తూనే 60వ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు. చివరి నిమిషంలో సమాచారం ఇచ్చినా అభిమానులంతా ఏకమై ఆయా నగరాల్లో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలకు పెద్ద ఎత్తున హాజరు కావడం అభినందనీయమన్నారు.  ప్రభుత్వం విధించిన నిబంధనల్ని పాటిస్తూ తమ అభిమాన నటుడి పట్ల ప్రేమను చాటుకొని వేడుకల్లో పాల్గొన్న అందరికీ కోమటి జయరాం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి..

హైదరాబాద్‌లో ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

అందుకు ఎంతో బాధగా ఉంది: బాలకృష్ణ


మరిన్ని