తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

నందిగామ : తానా ఫౌండేషన్‌ సహకారంతో నందిగామ పట్టణంలోని స్థానికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని 7, 17వ వార్డుల్లో నివసించే దాదాపు 1600 కుటుంబాలకు తానా ఫౌండేషన్ (తాళ్లూరి జయశేఖర్, శృంగవరపు నిరంజన్, ఉప్పుటూరి రాం చౌదరి, వాసిరెడ్డి వంశీ) చేయూతతో నిత్యావసరాలు సిద్ధం చేశారు. వీటిని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా స్థానికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి నరసింహారావు, వాసిరెడ్డి సీతాపతి, తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని