కువైట్‌లో ప్రవాస భారతీయులుపడిగాపులు
కువైట్‌లో ప్రవాస భారతీయులుపడిగాపులు

కువైట్‌: స్వదేశానికి వచ్చేందుకు ధ్రువీకరణ పత్రాలు దక్కక వందల సంఖ్యలో తెలుగువారు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. సరైన పత్రాలు లేనివారికి ఇవాళ్టి వరకు కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష గడువు ఇచ్చింది. ఇవాళ్టితో గడువు ముగియడంతో అక్రమంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. ఈ కారణంగా పలువురు ప్రవాస భారతీయులు, తెలుగువారు అత్యవసర ధ్రువీకరణ పత్రాల కోసం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 7,500 మంది భారతీయులు స్వదేశం వచ్చేందుకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,500 మందికి మాత్రమే అత్యవసర ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. పత్రాలు రాని వారు అక్కడే నిరీక్షిస్తున్నారు. రోడ్లపై పడిగాపులు కాస్తున్నామని తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు వాపోతున్నారు. అత్యవసర ధ్రువీకరణ పత్రం మంజూరు చేయని పక్షంలో రేపటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.
 

Tags :

మరిన్ని