భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు
భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు

దిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన వలస కార్మికులు, తీర్థ యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఇప్పటికే కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యంలోయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న భారతీయులు.. స్వదేశానికి వెళ్ళాలి అనుకుంటే,  వారికోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియను భారత రాయబార కార్యాలయం చేపట్టింది. ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా   ప్రభావం నేపథ్యంలో దుబాయ్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు మాత్రమే నమోదు ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


మరిన్ని