‘అమెరికాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండండి’
‘అమెరికాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండండి’

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో అక్కడ ఉన్న భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. కోవిడ్‌-19 నుంచి రక్షించుకునేందుకు స్వీయ నిర్బంధం చేసుకోవాలని కోరింది. వారం రోజుల క్రితం అన్ని వాణిజ్య విమానాల రాకపోకలపై భారత్‌ విధించిన తాత్కాలిక నిషేధం మార్చి 22 నుంచి అమలులోకి రానుంది.

ఈ నేపథ్యంలో రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు పలు సూచనలు చేసింది. సీడీసీ(సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) ఇచ్చే సలహాలను పాటించాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరింది. అమెరికాలో ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా 230 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడ 50 రాష్ట్రాల్లో 18వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

Advertisement


మరిన్ని