తానా టీమ్‌స్క్వేర్‌ సేవల విస్తరణ
తానా టీమ్‌స్క్వేర్‌ సేవల విస్తరణ

వాషింగ్టన్‌: అమెరికా, కెనడాల్లో ఉండే వారికి ఏదైనా ఆపద వస్తే ముందుగా తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలోని టీమ్‌ స్క్వేర్‌ (తానా అత్యవసర సహాయ బృందం) బృందమే గుర్తుకువస్తుంది. అక్కడి తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా వీరు ఒక్క ఫోన్‌ కాల్‌తో అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఆపదలో ఉన్న తెలుగు వారెవరైనా 1-855-OUR TANA టోల్‌ఫ్రీ నంబర్‌ కాల్‌ చేయడమే చేయాల్సిందల్లా. పన్ను మినహాయింపుతో  అందర్ని ఇందులో భాగస్వామ్యం చేసేందుకు విరాళాలకు అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఏమిటీ టీమ్‌ స్క్వేర్‌ 
యూఎస్‌, కెనడాలో 1-855 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకునేలా తానా వెయ్యి మంది వలంటీర్లతో దీన్ని ప్రారంభించింది. మరణించిన వారి పార్థివదేహాల్ని తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అత్యవసరంగా స్వదేశానికి పంపించేలా ఏర్పాట్లు చేయడంలో ఎంతో కీలకంగా పనిచేస్తోంది. భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి అన్ని అనుమతులు ఇప్పిస్తారు. ఈ ప్రక్రియలన్నీ 36-48 గంటల్లోనే పూర్తి చేసి స్వదేశానికి పంపేలా టీమ్‌స్క్వేర్‌ ఏర్పాట్లు చేస్తుంది. టీమ్‌ స్క్వేర్‌ తమ విధి విధానాలు, సహాయ కార్యక్రమాల గురించి మార్గదర్శకాలను www.tana.org సైట్‌లో తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో అందుబాటులో ఉంచింది. 

ఇప్పటి వరకు తానాకు వలంటీర్లు, విరాళాల పరంగా ఉత్తర అమెరికాలోని తెలుగు సమాజం అండగా ఉంది. తానా టీమ్‌ స్క్వేర్‌కు వచ్చే విరాళాలను ప్రత్యేకంగా పొదుపుగా నిర్వహిస్తోంది. www.tana.org/donate సైట్‌ ద్వారా ఎవరైనా ఉదారభావంతో స్వచ్ఛందంగా విరాళాలు సమర్పించాలనుకుంటే పన్ను మినహాయింపు అవకాశం కల్పిస్తోంది. 

Advertisement

Advertisement


మరిన్ని