close
అమెరికాలో అమరావతి గళం

రాజధాని రైతులకు మద్దతుగా  ప్రవాసాంధ్రుల సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు అమెరికాలోని ప్రవాసాంధ్రులు సంఘీభావం ప్రకటించారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌ నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన తెలుగువారు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ పోరాటం చేస్తున్న వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించారు. ఆర్థికంగానూ అండగా ఉండాలని తీర్మానించారు. ప్రవాసాంధ్రులతో ఒక ఐకాస ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సమావేశంలో నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. మీ రాజధాని ఏదని ఎవరినైనా అడిగితే ఒకే పేరు చెబుతారు.. కానీ ఏపీలో 3 పేర్లు చెప్పే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. అమరావతిని కాపాడుకోవడం చారిత్రక అవసరమన్నారు. పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, వివిధశాఖల భవనాలు అమరావతి ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.3వేల కోట్లు వ్యయం చేస్తే మిగిలినవీ పూర్తవుతాయి. ప్లాట్లు రైతులకు ఇవ్వగా 10వేల ఎకరాల భూమి ఉంటుంది. దానిని అమ్మగా వచ్చిన డబ్బులతో అభివృద్ధి పనులు పూర్తి చేయొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. ‘మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదు. ముఖ్యమంత్రి ఒకచోట.. మంత్రులు మరోచోట.. సచివాలయం ఇంకో దగ్గర ఉంటే.. పారిశ్రామికవేత్తలు అనుమతుల పొందేందుకు 3 చోట్లకూ తిరగాలా? ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడం మంచిది కాదు. రాజధాని అంశం ఒక వ్యక్తి, ఒక ప్రాంత సమస్య కాదు. 13 జిల్లాలకు చెందిన ఆంధ్రులసమస్య. దీనిపై యువతరం ఆలోచించాలి’ అని సూచించారు. రాజధాని వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రతాప్‌ చింతపల్లి, రాజా కసుకుర్తి, పవన్‌ తాతా, చంద్రశేఖర్‌ కొణెదల, రేఖ మంచి, వంశీ, రాధాకృష్ణ, శ్రీ కోనంకి పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.