ఘనంగా దేవులపల్లి సాహితీ వైభవ కార్యక్రమం
ఘనంగా దేవులపల్లి సాహితీ వైభవ కార్యక్రమం

పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి వర్థంతి సందర్భంగా సాహితీ వైభవం కార్యక్రమంగా అంతర్జాలం వేదికగా నిర్వహించారు. వంశీ ఇంటర్నేషనల్‌ ఇండియా ఆధ్వర్యంలో 11 దేశాలలోని సాహితీవేత్తలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్‌, అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, సింగపూర్‌, హాంకాంగ్‌‌, మలేషియా, మారిషస్‌, ఆస్ట్రేలియా, దోహా-ఖతార్‌, అబుదాబీ దేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవులపల్లివారి సాహితీ వైభవాన్ని కొనియాడారు.

ఈ సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు మాట్లాడుతూ ‘1978లో దేవులపల్లివారిని సత్కరించామని, ఆయన పేరుమీద కాకతీయ విశ్వవిద్యాలయంలో స్వర్ణపతకాన్ని నెలకొల్పామని గుర్తుచేశారు. దేవులపల్లి రచించిన లలితగీతాలను వేదవతీ ప్రభాకర్‌, సురేఖామూర్తి, దివాకర్ల, శశికళాస్వామి వేదాల, హిమబిందు తదితరులు ఆలపించారు. దేవులపల్లి మనుమరాలు రేవతి అడితం అమెరికా నుంచి మాట్లాడుతూ ‘మా తాతగారు మరణించి 4 దశాబ్దాలైనా వారిని స్మరిస్తూ 1978 నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంశీ సంస్థకు నా అభినందనలు’ అన్నారు.

కార్యక్రమంలో జమునా రమణారావు, మండలి బుద్ధప్రసాద్‌, రేలంగి నరసింహారావు, సినీనటి పల్లవి, సినీ గేయరచయిత భువనచంద్ర, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, డా.ఓలేటి పార్వతీశం, డా.దామరాజు కామేశ్వరరావు, అమెరికా నుంచి రత్న(పాప)కుమార్‌, డా.చిట్టెన్‌రాజు వంగూరి, డా.శారదాపూర్ణ శొంఠి, రాధికా నోరి, యూకే నుంచి డా.జొన్నలగడ్డ మూర్తి, సింగపూర్‌ నుంచి రత్నకుమార్‌ కవుటూరు, సుబ్బు వి. పాలకుర్తి, హాంకాంగ్‌ నుంచి జయ పీసపాటి, ఆస్ట్రేలియా నుంచి సారథి మోటమర్రి, డా, యల్లాప్రగడ రామకృష్ణారావు, దక్షిణాఫ్రికా నుంచి రాపోలు సీతారామరాజు, మలేషియా నుంచి సత్యమల్లుల, దుర్గప్రియా గొట్టాపు, మారిషస్‌ నుంచి సంజీవ నరసింహ అప్పడు, నరైన్‌స్వామి సన్యాసి, ఖతార్‌ నుంచి తాతాజీ ఉసిరికల, కాళీబాబు దంటి, కల్యాణి కొండూరు, రామడుగు వేణుగోపాల, డా.వెంకట మాధవీ లలిత జినుగు, అబుదాబీ నుంచి చింతగుంట ఉదయపద్మలతో పాటు, అనఘదత్త రామరాజు, గుంటూరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్‌ రామరాజు, వంశీ అధ్యక్షురాలు డా.తెన్నేటి సుధ, వంశీ మేనేజింగ్‌ ట్రస్టీ శైలజ సుంకరపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని