close
అట్లాంటాలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అట్లాంటా తెలుగు చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు వారు భారీగా పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో వారంతా వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధా దాసరి, పాస్టర్‌ జాన్‌ బిల్లా భక్తులతో ప్రార్థనలు చేయించారు. క్రీస్తు సందేశాన్ని పాస్టర్‌ బిల్లా వినిపించారు. ఈ సందర్భంగా  చిన్నారులు వేసిన ఏసుక్రీస్తు నాటకం ఆకట్టుకుంది. అట్లాంటాలోని తెలుగు చర్చి ఆధ్వర్యంలో ఏడేళ్లుగా ఈవిధంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

 


వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.