అభిమానులు నా ప్రాణ సమానులు: బాలకృష్ణ
అభిమానులు నా ప్రాణ సమానులు: బాలకృష్ణ

అమెరికాలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

న్యూజెర్సీ‌: ప్రముఖ సినీనటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. నాట్స్ మాజీ అధ్యక్షుడు, తెదేపా సీనియర్ నేత మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు న్యూజెర్సీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య జూమ్‌ కాల్‌లో అభిమానులతో ముచ్చటించారు. అమెరికాలోని తన అభిమానులు తన పట్ల ఎప్పుడూ చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమాలకు, బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి అమెరికాలోని తన అభిమానులు అందించిన సహాయ సహకారాలు ఎప్పటికీ మరువలేనన్నారు. అభిమానులు తన ప్రాణ సమానులని, వాళ్ల కోసం కడదాకా సినిమాల్లో నటిస్తూనే ఉంటానని స్పష్టంచేశారు.

హిందూపూర్‌ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు బాసటగా నిలుస్తున్నారని మన్నవ మోహన్ కృష్ణ కొనియాడారు. ఈ సందర్భంగా న్యూజెర్సీలో పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కేక్ కట్ చేసి బాలయ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు. ఆయన నటించిన సినిమాల్లోని డైలాగులు, పాటలను వింటూ ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాధా నల్లమల, ప్రతాప్ చింతపల్లి, రమేష్ నూతలపాటి, వంశీ, శ్రీహరి మందాడి, మోహన్ కుమార్ వెన్నిగళ్ల, రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు కృషిచేశారు.

Advertisement

Advertisement


మరిన్ని