యప్‌ టీవీ ఫ్లాష్‌ సేల్‌.. ప్యాకేజీల్లో భారీ తగ్గింపు! 
యప్‌ టీవీ ఫ్లాష్‌ సేల్‌.. ప్యాకేజీల్లో భారీ తగ్గింపు! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు వినోదాన్ని అందిస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘యప్‌ టీవీ’ అతిపెద్ద ప్లాష్‌ సేల్‌తో ముందుచ్చింది. అన్ని భారతీయ భాషల ప్యాక్‌లను భారీ తగ్గింపుతో అందిస్తోంది.  దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులకు సేవలందిస్తున్న ఈ సంస్థ.. 12 ప్రముఖ భారతీయ భాషల నుంచి ఉత్తమ ఛానెళ్ల ప్రసారాలను అందించడం ద్వారా ప్రపంచ నంబర్‌ వన్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంగా ఎదిగింది. ఇప్పటికే పలు దేశాల్లో సహేతుకమైన ధరలకే సేవలందిస్తున్న యప్‌ టీవీ.. మరింత మందిని ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త ఫ్లాష్‌ సేల్‌ చేపట్టింది. ఈ నెల 24 నుంచే కొనసాగుతున్న ఈ సేల్‌లో ఇదివరకు ఎప్పుడూ లేనంతగా భారీ తగ్గింపు ధరలకు టీవీ ప్యాకేజీలను అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఔత్సాహికులు తక్కువ ధరలకే ఈ ప్యాకేజీలను పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ అవకాశం కేవలం ఈ నెల 28 వరకే ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది.  

వినోదాన్ని పంచే షోలు.. కొత్త చిత్రాలూ..!
ఈటీవీ, జెమినీ, స్టార్‌మా తదితర తెలుగు ఛానళ్లు ప్రసారం చేస్తున్న  జబర్ధస్త్‌, క్యాష్‌ ప్రొగ్రామ్‌లతో పాటు పిన్ని -2, బొమ్మరిల్లు, కార్తిక దీపం, ఆమె కథ తదితర సీరియళ్లు యప్‌ టీవీలో చూడొచ్చని ఆ సంస్థ తెలిపింది. అలాగే, మలయాళం, బెంగాలీ, కన్నడ, మరాఠీ తదితర భాషల్లోని షోలు, సీరియళ్లు, సినిమాలు చూడొచ్చని పేర్కొంది. మొత్తం అన్ని భారతీయ భాషల్లోని టీవీ షోలు, సీరియళ్లు తాజా ఎపిసోడ్‌లు యప్‌ టీవీలో ప్రసారం చేస్తున్నట్టు తెలిపింది. సోనీ, జీ టీవీ, స్టార్ ప్లస్, సన్ టీవీ, స్టార్ విజయ్, తదతర ఛానళ్లు ప్రసారం చేసే అత్యుత్తమ ప్రదర్శనలు, మంచి సినిమాలను సైతం వీక్షించే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది.  

తాజాగా విడుదలైన జవానీ జానేమాన్‌, తన్హాజీ వంటి హిందీ చిత్రాలతో పాటు యహ్‌ రస్తే హై ప్యార్‌ కే, నాగిన్‌లాంటి పాపులర్‌ షోలు, ఇండియాస్‌ బెస్ట్‌ డేన్సర్‌, కుమ్‌కుమ్‌ భాగ్య తదితర కార్యక్రమాలను సైతం ఇప్పుడు యప్‌ టీవీలో వీక్షించొచ్చు. 

యప్‌ టీవీ వార్షిక ప్యాక్‌ల వివరాలివీ.. 
యప్‌ టీవీ తాజాగా ఐదు దేశాల్లోని ప్రవాస భారతీయులకు ఈ  వార్షిక ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్యాక్‌ల ధరలను పరిశీలిస్తే..  ఆస్ట్రేలియా - 119.99 డాలర్లు; న్యూజిలాండ్‌ 119.99 డాలర్లు, యూకే 69.99 పౌండ్లు, యూరప్‌ 69.99 యూరోలు; అమెరికా 99.99 డాలర్లు చొప్పున చెల్లించి ఏడాది మొత్తం ఆయా టీవీల ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ నెల 28 వరకు కేవలం పైన పేర్కొన్న ఐదు దేశాల్లో ఉన్న భారతీయులకు మాత్రమే ఈ ఫ్లాష్‌ సేల్‌ అందుబాటులో ఉండనుంది. మరిన్ని వివరాలు https://www.yupptv.com/flashsale చూడొచ్చు.

Advertisement


మరిన్ని