నిరుపేదలకు వెంకట్‍ కోగంటి  చేయూత
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నిరుపేదలకు వెంకట్‍ కోగంటి  చేయూత

విజయవాడ : కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు కాలినడకన బయలుదేరిన వలస కార్మికులు, పేదల ఆకలి తీర్చేందుకు కాలిఫోర్నియాలో తానా జాయింట్‍ ట్రెజరర్‍ వెంకట్‍ కోగంటి ముందుకొచ్చారు. తానా నాయకుల సహకారంతో విజయవాడలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 11న మొదలైన ఈ కార్యక్రమం 10 రోజులుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ వెయ్యిమంది పేదలకు కడుపు నింపుతున్నారు. విజయవాడలోని అలంకార్‍ సెంటర్‍, రైల్వేస్టేషన్‍, అన్న క్యాంటీన్‍, బెంజ్‍ సర్కిల్‍, రామవరప్పాడు రింగ్‍ రోడ్డుతోపాటుగా పలుచోట్ల ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 10,000మందికి అన్నదానం చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు వెంకట్‍ కోగంటి చెప్పారు. వెంకట్‍ కోగంటి అమృతహస్తం ఛారిటబుల్‍ ట్రస్ట్ కరుణశ్రీ, ఆంజనేయులు కొత్తతో కలిసి శ్రీనివాస్‍ వల్లూరిపల్లి, కోనేరు శ్రీకాంత్, మద్దతుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని వెంకట్‌ కోగంటి తెలిపారు. 
తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, ఫౌండేషన్‍ ఛైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, నాదెండ్ల గంగాధర్, సతీష్‍ వేమన, బోర్డ్ ఛైర్మన్‌ హరీశ్‌ కోయ, వైస్‍ ప్రెసిడెంట్‍ అంజయ్యచౌదరి లావు, సెక్రటరీ రవి పొట్లూరి తదితరులకు వెంకట్‍ కోగంటి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.


మరిన్ని