కొత్తరకం కరోనా: అమెరికా మరింత అప్రమత్తం
కొత్తరకం కరోనా: అమెరికా మరింత అప్రమత్తం

వాషింగ్టన్‌: కొత్తరకం కరోనా వైరస్‌ వ్యాప్తిపై అమెరికా మరింత అప్రమత్తమైంది. యునైటెడ్‌ కింగ్‌డం నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు అమెరికన్‌ సీడీసీ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. సీడీసీ తాజా నిర్ణయం ట్రంప్‌ పాలకవర్గానికి ఎదురుదెబ్బ అని చెప్పాలి. యూకే నుంచి వచ్చే వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసే ఆలోచనేమీ లేదని మంగళవారం శ్వేతసౌధం తెలిపింది. దీనికి విరుద్ధంగా సీడీజీ తాజా మార్గదర్శకాలు ఉండడం గమనార్హం.

ధ్రువపత్రం లేనివారిని విమానంలోకి అనుమతించవద్దని విమానయాన సంస్థలకు సూచించింది. సోమవారం నుంచి ఈ మార్గర్శకాలు అమల్లోకి రానున్నాయి. మార్చిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో యూకేలో పర్యటించిన వారందరి ప్రవేశంపై నిషేధం విధిస్తూ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాల్ని ఈ సందర్భంగా సీడీసీ ప్రస్తావించింది.

ఇవీ చదవండి..

కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చొచ్చా?

మన టీకాపై ప్రపంచ దేశాల దృష్టి!

Advertisement


మరిన్ని