ట్రంప్‌కు ఈ సారి ఆ అవకాశం లేదు
ట్రంప్‌కు ఈ సారి ఆ అవకాశం లేదు

ప్రచారం నిర్వహించబోమంటున్న సంస్థ

వాషింగ్టన్‌: గత అమెరికా ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వేల మంది భారతీయులతో (హిందువులతో) ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్న చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కాగా ఈ సారి ఆయనకు అటువంటి అవకాశం ఇవ్వబోమని ‘ది రిపబ్లికన్‌ హిందూ కొలిషన్‌’ (ఆర్‌హెచ్‌సీ) సంస్థ వెల్లడించింది. న్యూజెర్సీకి చెందిన ఈ సంస్థ ఇక్కడి ఓ మతవర్గానికి, రిపబ్లికన్‌ నేతలకు వారధిగా పనిచేస్తోంది. కాగా, ఈసారి ట్రంప్‌ తరపున ప్రచారం చేయరాదని ఆర్‌హెచ్‌సీ నిర్ణయించింది.

2015లో ప్రారంభించిన తమ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 50వేల మంది సభ్యులుగా ఉన్నట్టు అధ్యక్షుడు శలభా కుమార్‌ తెలిపారు. 2016లో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఓ మత వర్గానికి చెందిన 8000 మంది భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ఇప్పుడు కూడా తనతో సహా సంస్థ సభ్యుల మద్దతు ట్రంప్‌కేనని.. అయితే ఇమ్మిగ్రేషన్‌ విధానంపై అధ్యక్షుడు తమకు స్పష్టమైన హామీ ఇస్తేగానీ తాము రిపబ్లికన్‌ పార్టీ తరపున ప్రచారం చేయబోమని కుమార్‌ వివరించారు. మరో వైపు డెమోక్రాట్లు తొలిసారిగా తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ తరపున ‘హిందూస్‌ ఫర్‌ బైడెన్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రతినిధి రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో ఈ సంస్త విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిసింది.

Advertisement

Advertisement


మరిన్ని