‘రైతుల ఆందోళనపై భారత్‌తో చర్చించండి’
‘రైతుల ఆందోళనపై భారత్‌తో చర్చించండి’

అమెరికా విదేశాంగ మంత్రికి అక్కడి చట్టసభ సభ్యుల లేఖ

వాషింగ్టన్‌: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు వ్యక్తం చేస్తున్న నిరసనపై అమెరికా చట్టసభల్లోని కొంతమంది కీలక సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై భారత విదేశాంగశాఖతో చర్చించాలని కోరుతూ ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు లేఖ రాశారు. వీరిలో భారతీయ అమెరికన్‌ ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. రైతుల ఆందోళన విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని గతంలోనే భారత్‌ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అంతర్గత విషయమని.. దీనిపై బయటి వ్యక్తుల వ్యాఖ్యలు అనసరమైనవని తేల్చి చెప్పింది.

అనేక మంది భారతీయ అమెరికన్లకు ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని లేఖలో సభ్యులు పేర్కొన్నారు. ఈ ఉద్యమం వల్ల యావత్తు భారత్‌పై ప్రభావం ఉండనుందని అభిప్రాయపడ్డారు. దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయులందరినీ ఇది ఆందోళనపరుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రితో మాట్లాడాలని సూచించారు. భారత చట్టాలను తాము గౌరవిస్తామని చెబుతూనే.. భారత రైతులకు ఆర్థిక భద్రతపై అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు అమెరికా చట్టసభలకు చెందిన దాదాపు 12 మందికి పైగా సభ్యులు భారత రైతుల నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

రండి.. మాట్లాడుకుందాం

స్వతంత్ర వ్యవసాయ సంస్థలు ఐసీఏఆర్‌లో విలీనం!

Advertisement

Advertisement


మరిన్ని