మరో 4 దేశాల ప్రయాణికులకూ కొవిడ్‌ స్క్రీనింగ్‌
close
మరో 4 దేశాల ప్రయాణికులకూ కొవిడ్‌ స్క్రీనింగ్‌

దిల్లీ: భారత విమానాశ్రయాల్లో మరో నాలుగు దేశాల ప్రయాణికులకూ కొవిడ్ పరీక్షలను విస్తరింపజేస్తూ డెరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌‌(డీజీసీఏ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. నేపాల్‌, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా దేశాల నుంచి వచ్చే వారికి సైతం విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆ సంస్థ విమానాశ్రయాలను ఆదేశించింది. ఈ మేరకు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం చైనా, హాంగ్‌కాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ ఈ ఆరు దేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరు దేశాలతో పాటు ఇప్పుడు కొత్తగా నాలుగు ఆసియా దేశాల ప్రయాణికులకు కూడా స్క్రీనింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

కొవిడ్‌ సోకిన ప్రయాణికులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి విమానాశ్రయాల్లో ఆరోగ్య అధికారులు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రయాణికుడి మీద అనుమానం కలిగితే  14 రోజుల పాటు పరీక్షా కేంద్రానికి తరలిస్తున్నారు. కాగా చైనాలో విజృంభిస్తున్న కొవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు దాదాపు 2,500 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 80వేల మంది ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. ఈ విష మహమ్మారి కారణంగా భారత్‌లో ఇప్పటివరకూ ఒక్క మరణం కూడా సంభవించలేదు. 
 


మరిన్ని