అమరావతి ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐ విరాళం
అమరావతి ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐ విరాళం

అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతోంది. అమరావతి ఉద్యమానికి అండగా నిలిచేందుకు ఎన్‌ఆర్‌ఐలు, ఆయా సంఘాలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐ సురేశ్‌ పుట్టగుంట.. ఉద్యమానికి మద్దతుగా విరాళం ప్రకటించారు. అమెరికాలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి జయరాం కోమటి పిలుపునకు స్పందించి రూ.20లక్షల విరాళాన్ని సురేశ్‌ అందజేశారు. సురేశ్‌ స్వస్థలం విజయవాడ. ప్రస్తుతం అమెరికాలోని డెట్రాయిట్‌లో స్థిరపడ్డారు. తెలుగువారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రస్తుతం తానా ట్రస్టీగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. తమ ఉద్యమానికి విరాళం ప్రకటించి అండగా నిలిచిన సురేశ్‌ పుట్టగుంటకు అమరావతి రైతులు ధన్యవాదాలు తెలిపారు.


మరిన్ని