IN PICS: మోహన్‌లాల్‌-సంజయ్‌ దీపావళి పార్టీ
IN PICS: మోహన్‌లాల్‌-సంజయ్‌ దీపావళి పార్టీ

వైరల్‌గా మారిన ఫొటోలు

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఎంతోమంది సినీతారలు తాజాగా తమ సన్నిహితులతో దీపావళి వేడుకలు జరుపుకోవడానికి ఆసక్తి కనబరిచారు. వేడుకల్లో భాగంగా చిరు తన గురువు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ని కలిసి సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళీ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌.. తన స్నేహితుడు సంజయ్‌దత్‌తో వేడుకలు‌ జరుపుకున్నారు. ఇటీవల దుబాయ్‌కి వెళ్లిన మోహన్‌లాల్‌.. సంజయ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. సంజయ్‌ సతీమణి మాన్యతా దత్‌ ఇన్‌స్టా వేదికగా ఫొటోలను షేర్‌ చేశారు. దీంతో ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సింగర్‌ నేహా కక్కర్‌ సైతం.. భర్తతో తన మొదటి దీపావళిని దుబాయ్‌లో జరుపుకున్నారు. విదేశాల్లో ఉన్న నటి ప్రియాంక చోప్రా దంపతులు దివ్వెలతో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.





మరిన్ని