close
ఎన్నారైలూ గమనించండి...

ప్రవాస భారతీయుల పాన్‌-ఆధార్‌ లింకింగ్‌ ఆఖరి తేదీ డిసెంబర్‌ 31

దిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్నారై) తమ పాన్‌ కార్డులను ఆధార్‌ కార్డుతో అనుసంధానించటం తప్పనిసరి. ఈ అనుసంధానానికి డిసెంబరు 31 ఆఖరు తేదీ. గడువులోగా అనుసంధానం చేయని పాన్‌కార్డులు చెల్లుబాటు కావని సంబంధిత అధికారులు వెల్లడించారు.

నిజానికి ప్రవాస భారతీయులకు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు తప్పనిసరి కాదు. అయితే ఆ రెండు కలిగి ఉన్న వారు మాత్రం డిసెంబర్‌ 31లోగా తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. స్వదేశంలో ఆర్థిక లావాదేవీలు చేయాలనుకునే ఎన్నారైలకు ఈ రెండు పత్రాలు అవసరం. ఈ అనుసంధానికి సెప్టెంబర్‌ 30గా ఉన్న గడువును గతంలో డిసెంబర్‌ 31 వరకూ పొడిగించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.