ఇతర దేశాల్ని గౌరవించడం నేర్చుకోండి..!
ఇతర దేశాల్ని గౌరవించడం నేర్చుకోండి..!

టర్కీ అధ్యక్షుడికి భారత్‌ ఘాటు సూచన

దిల్లీ: ఐక్యరాజ్య సమితి వేదికపై కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి మన దేశ అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు భారత్‌ దీటుగా బదులిచ్చింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలంటూ ఘాటుగా సూచించింది. సొంత దేశ వ్యవహారాలపై దృష్టి సారించాలని గట్టిగా హితవు పలికింది. 

‘‘భారత్‌లో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌ గురించి టర్కీ అధ్యక్షుడు ప్రస్తావించడాన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది ముమ్మాటికీ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమే. దీన్ని మేం ఏమాత్రం అంగీకరించబోం. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ నేర్చుకోవాలి. సొంత దేశ విధానాలపై దృష్టి సారించాలి’’
    - తిరుమూర్తి, ఐరాసలో భారత ప్రతినిధి

ఐరాస సర్వప్రతినిధి సభ 74వ వార్షిక సమావేశాల్లో మంగళవారం ఎర్డోగన్‌ తన వీడియో సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ఈ ప్రాంతంపై ఉన్న వివాదాన్ని ఐరాస నిబంధనల ప్రకారం పరిష్కరించాలంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు చేశారు. 2019లోనూ ఎర్డోగన్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి భారత్‌ ఆగ్రహానికి గురయ్యారు. తిరిగి అదే వేదికపై మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. 

ఇవీ చదవండి..

సంక్షోభంలో ఐరాస విశ్వసనీయత
పాక్.. మా విషయాల్లో జోక్యం వద్దు: భారత్‌

Advertisement

Advertisement


మరిన్ని