వేల్స్‌లో వైకుంఠ ఏకాదశి వేడుకలు
వేల్స్‌లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

కార్డిఫ్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భారత్‌లోనే కాకుండా వివిధ దేశాల్లోనూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. యూకేలోని వేల్స్‌ రాజధాని కార్డిఫ్ నగరంలో హిందూ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశిని స్థానిక ఆలయంలో ఘనంగా జరుపుకొన్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా కొద్దిమంది భక్తులు హాజరవగా అనేక మంది స్కైప్‌ ద్వారా వేడుకల్లో పాల్గొన్నారు. సుప్రభాతం, అభిషేకంపూజలతోపాటు హారతి, నైవేద్యం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలో క్రిస్మస్‌ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుండగా.. మరోవైపు భారతీయులు సైతం ఏకాదశిని వేడుకగా జరుపుకొన్నారు. అలిపిరి నుంచి తీసుకువచ్చిన బాలాజీ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి పదేళ్లు అవుతున్న సందర్భంగా డా.వెలగపూడి బాపూజీరావ్‌, కిరణ్ చెముడిపాటి, సురేశ్‌ అరవ ఇండియా సెంటర్‌ మ్యాగజైన్‌ను గత ఏడాది విడుదల చేశారు. సురేశ్‌ అరవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

పంపిన వారు : డా. నగేశ్‌ చెన్నుపాటి

ఇవీ చదవండి...

వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?

Advertisement


మరిన్ని