దూసుకెళ్తున్న బైడెన్‌
దూసుకెళ్తున్న బైడెన్‌

వాషింగ్టన్‌: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ దూసుకుపోతున్నారు. అంచనాల ప్రకారం.. ఇప్పటికే మెజార్టీ ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను కైవసం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల సరళిలో ఇప్పటి వరకు బైడెన్‌ 213.. ట్రంప్‌ 118 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు సాధించారు. ఇరువురి మధ్య ఆధిక్యంలో భారీ తేడా కనిపిస్తోంది. మొత్తం 580 ఓట్లకుగానూ 270 గెలుచుకున్నవారే అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. దాదాపు అన్ని ప్రీ-పోల్స్‌ బైడెన్‌కు అనుకూల ఫలితాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఓటింగ్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా ఉద్యమంలా సాగింది. కొత్త అధ్యక్షుణ్ని ఎన్నుకునేందుకు కొవిడ్‌ ముప్పును కూడా లెక్కచేయకుండా.. ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 16 కోట్ల మంది ఓటు వేస్తారని అంచనా ఉంది. ఓటింగ్‌ ప్రక్రియ ఈ సాయంత్రానికి అన్ని రాష్ట్రాల్లో ముగియనుంది. పశ్చిమ తీరంలోని రాష్ట్రాల్లోని ఇప్పటికే ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయి.. లెక్కింపు కొనసాగుతోంది. శతాబ్దంలోనే అత్యధిక ఓటింగ్‌ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 

బైడెన్‌ గెలిచిన రాష్ట్రాలు..  ట్రంప్‌ గెలిచిన రాష్ట్రాలు
రాష్ట్రం  ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు రాష్ట్రం  ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు
కనెక్టికట్‌  07  వ్యోమింగ్‌       03
డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా  03 వెస్ట్‌ వర్జీనియా  05
డెలావేర్‌  03 టెన్నెసీ   11
ఇల్లినాయిస్‌ 20 సౌత్‌ డకోటా   03
మసాచుసెట్స్‌  11 సౌత్‌ కరోలైనా   09
మేరీలాండ్‌   10 ఒక్లహామా   07
న్యూజెర్సీ   14 నెబ్రాస్కా   03
న్యూ మెక్సికో 05 నార్త్‌ డకోటా 03
న్యూయార్క్‌  29 మిస్సిసిపీ 06
రోడ్‌ ఐలాండ్‌  04 లూసియానా  08
వర్జీనియా  13 కెంటకీ     08
వెర్మాంట్‌     03 ఇండియానా    11
కొలరెడో  09 అర్కాన్సాస్‌      06
 కాలిఫోర్నియా     55    అలబామా  09
కొలరెడో   09 యూటా 06
వాషింగ్టన్‌      12 మిస్సౌరీ 10
హవాయి 04 కాన్సాస్ 06
    ఇదాహో 04
    అర్కాన్సాస్‌ 06
మొత్తం  213   118

మరిన్ని