
మిలియన్ డాలర్ల క్లబ్లో నాని ఆరో చిత్రం
హైదరాబాద్: కథానాయకుడు నాని నటించిన ‘జెర్సీ’ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్లో అడుగుపెట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకున్న నాని ఆరో సినిమా ఇదని తెలిపారు. ఈ నెల 19న విడుదలైన చిత్రం అమెరికా ప్రీమియర్లో 144,687 డాలర్లు, తొలి రోజున 262,732 డాలర్లు, రెండో రోజున 325,923 డాలర్లు, మూడో రోజున 179,391 డాలర్లు, నాలుగో రోజున 43,381 డాలర్లు, ఐదో రోజున 43,220 డాలర్లు మొత్తం 1,000,025 డాలర్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
‘జెర్సీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ బాణీలు అందించారు. ఇందులో నాని ‘అర్జున్’ అనే క్రికెటర్గా కనిపించి అందరి ప్రశంసలు పొందారు.
వార్తలు / కథనాలు
మరిన్ని
దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!