
హైదరాబాద్: సమంత కీలక పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా, అమెరికాలోనూ ఈ సినిమాకు విశేష స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. దాదాపు 500లకు పైగా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. సినిమాకు మంచి టాక్ రావడంతో మరిన్ని షోలను పెంచినట్లు ఓవర్సీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘మీ నుంచి వస్తున్న స్పందనకు నిజంగా ధన్యవాదాలు. మీ తల్లి, బామ్మలతో కలిసి ఈ సినిమా చూడండి. మిమ్మల్ని నిజంగా అలరిస్తుంది’ అని అన్నారు. ఇక గతంలో సమంత నటించిన ‘యూటర్న్’తో పోలిస్తే ఓపెనింగ్ కలెక్షన్లు 15రెట్లు ఎక్కువగా వసూలైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
వార్తలు / కథనాలు
మరిన్ని
జిల్లా వార్తలు
దేవతార్చన
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు