Latest Telugu News, Headlines - EENADU
close
యూఎస్‌సీఐఎస్‌ ఆమోదిత పిటిషన్‌ ఉంటేనే..!

యూఎస్‌సీఐఎస్‌ ఆమోదిత పిటిషన్‌ ఉంటేనే..! 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బీ1 వీసాపై అమెరికా వెళ్లి జూన్‌ వరకు ఉన్నాను. 2019 ఫిబ్రవరి వరకు ఉండేందుకు అనుమతిస్తూ స్టాంప్‌ వేశారు. మళ్లీ అమెరికా వెళ్దామనుకుంటున్నా. ఏమైనా సమస్య వస్తుందా?

- వినోద్‌కుమార్‌ మద్దుల

వీసా చెల్లుబాటులో ఉన్న కాలంలో ఎప్పుడైనా మీరు అమెరికా వెళ్లవచ్చు. అమెరికా ప్రవేశ ప్రాంతంలోని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ మీ పాస్‌పోర్టులోగానీ, ఐ-94లోగానీ పేర్కొన్నంత కాలం మీరు అమెరికాలో ఉండవచ్చు.



2019 జనవరి వరకు చెల్లుబాటయ్యే హెచ్‌1బి పిటిషన్‌ ఉంది. ఇప్పటి వరకు స్టాంపింగ్‌కు వెళ్లలేదు. అమెరికా వెళ్లేందుకు ఇటీవల అవకాశం లభించింది. నా పిటిషన్‌ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు వీసా స్టాంపింగు కోసం వెళ్తే నా అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? హెచ్‌1బి పొడిగింపును ఎప్పటిలోగా చేయించుకోవాల్సి ఉంటుంది?

- కోటేష్‌ పడుచూరి

హెచ్‌1బి పిటిషన్‌ లేదా ఐ-797లో యునైటెడ్‌ స్టేట్స్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఆమోదించిన మేరకు వీసా చెల్లుబాటులో ఉంటుంది. హెచ్‌1బి పిటిషన్‌ గడువు పొడిగించుకునేందుకు మీ యాజమాన్యాన్ని సంప్రదించాలి. వీసా దరఖాస్తు, అపాయింటుమెంటు తదితర సమాచారం కోసం www.ustraveldocs.com/in చూడండి.



ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరంలో ఉన్నాను. ఫాల్‌ సీజనులో ప్రవేశం కోసం అమెరికా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాను. నాలుగో సంవత్సరపు తొలి సెమిస్టర్‌ ధ్రువపత్రాలతో వీసా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చా?

- రమేష్‌ సిలిగురి

మీ ఐ-20లో పేర్కొన్న ప్రవేశ తేదీకి 120 రోజుల ముందుగా మాత్రమే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆమోదం పొందిన వీసాను విద్యా సంవత్సరం ప్రారంభానికి 30 రోజుల ముందు మాత్రమే ప్రయాణానికి వినియోగించాలి. దరాఖాస్తుదారుడి విద్యార్హతలను కాన్సులర్‌ అధికారి స్థూలంగా పరిశీలిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో విద్యార్థులు మునుపటి మార్కులు, బ్యాక్‌లాగ్స్‌, వివిధ పరీక్షల స్కోర్స్‌, ఉన్నత విద్యకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక తదితర విషయాలను ప్రశ్నిస్తారు. ప్రస్తుత మీ అకడెమిక్స్‌ ఆధారంగా ఐ-20 లభిస్తే ఎలాంటి ధ్రువపత్రాలను అందజేయాల్సిన అవసరం ఉండదు. 



సాఫ్ట్‌వేర్‌ రంగంలో అనుభవం ఉంది. హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చా?

- కేవీ ప్రసాదరావు

హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేయాలంటే మీ పక్షాన అమెరికాలోని సంస్థ యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌)కు పిటిషన్‌ దాఖలు చేయాలి. అది ఆమోదం పొందిన తరవాత వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in ను పరిశీలించండి.



వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌    చేయండి. 
మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.