Latest Telugu News, Headlines - EENADU
close
వీసా పునరుద్ధరణ సాధ్యం కాదు! 

వీసా పునరుద్ధరణ సాధ్యం కాదు! 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు... హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి... 
*హెచ్‌1బి వీసాపై అమెరికాలో 2011 నుంచి 2014 మధ్య కాలంలో రెండున్నరేళ్లపాటు పని చేశాను. హెచ్‌1బి కింద ఇచ్చే ఆరేళ్ల కోటాను వినియోగించుకోలేదు. 2014 సెప్టెంబరులో హెచ్‌1బి వీసా కాలం తీరింది. దాన్ని పునరుద్ధరించుకోవచ్చా?

- ఉదయ్‌

ఆ వీసాను పునరుద్ధరించుకోలేరు. హెచ్‌1బి నూతన వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో మీపక్షాన పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి. ఆ పిటిషన్‌ను యూఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ ఆమోదించాలి. నూతన పిటిషన్‌ ఆమోదం పొందిన తరవాత హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి, అపాయింటుమెంటును ఎలా షెడ్యూల్‌ చేసుకోవాలి తదితర సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in ను చూడండి.


*2019 ఫిబ్రవరిలో నా వీసా కాలం చెల్లనుంది. 2018 డిసెంబరులో తొమ్మిది రోజులపాటు బిజినెస్‌ ట్రిప్‌పై అమెరికా వెళదామనుకుంటున్నాను. ఏదైనా సమస్య వస్తుందా? వీసా పునరుద్ధరించుకున్న తరవాత వెళ్లమంటారా?            - రవికిరణ్

వీసా చెల్లుబాటులో ఉన్న సమయంలో ఎప్పుడైనా మీరు ప్రయాణం చేయవచ్చు. వీసాలో నమోదు చేసిన తేదీ వరకు అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకే మీ వీసా అనుమతిస్తుంది. అమెరికాలోకి మిమ్మల్ని అనుమతించాలా? లేదా? అనుమతిస్తే ఎంత కాలం? అన్నది ప్రవేశప్రాంతంలోని ఇమిగ్రేషన్‌ అధికారి నిర్ణయిస్తారు. వీసా గడువు తీరేలోగా పునరుద్ధరించుకోవచ్చు. ఇంటర్వ్యూ మినహాయింపునకు కూడా మీరు అర్హత పొందవచ్చు. మరింత సమాచారానికి www.ustraveldocs.com/in ను పరిశీలించండి.



*  అమెరికాలో పీహెచ్‌డీ చేద్దామనుకుంటున్నాను. విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుందా? 

- రామ్మోహన్‌ కేఎస్‌

అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పులు ఇతర విధానాల ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఏ విశ్వవిద్యాలయంలో చదవాలని మీరు నిర్ణయించుకుంటారో అక్కడి ఆర్థిక సహాయ విభాగాన్ని నేరుగా సంప్రదించండి. మరింత సమాచారం కోసం ‌www.usief.org.in ను చూడండి.



*సీనియర్‌ సిటిజన్‌ అయిన నేను గడిచిన మూడేళ్లలో ఏడు దఫాలు అమెరికాలో పర్యటించాను. ఈ ఏడాది డిసెంబరులో నా వీసా కాలం తీరనుంది. డ్రాప్‌ బాక్స్‌ విధానం ద్వారా వీసా పునరుద్ధరణ చేసుకోవచ్చా? లేక వీసా ఇంటర్వ్యూ కోసం హాజరుకావాలా?

- పి.కోటేశ్వరరావు

* ఇంటర్వ్యూ మినహాయింపు కోసం మీరు అర్హత పొందవచ్చు. మీరు అర్హులా? కాదా? అన్నది పరిశీలించేందుకుhttps://www.ustraveldocs.com/in/in-niv-visarenew.asp ను చూడండి. ఇంటర్వ్యూ మినహాయింపు నిబంధనలకు మీరు అర్హులు కాకపోతే వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అదే వెబ్‌సైట్‌ ద్వారా అపాయింటుమెంటును షెడ్యూల్‌ చేసుకోండి.



* వీసాలకు సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support n india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేయండి. 
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలనుusvisa@eenadu.net  కు పంపగలరు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.