Array
(
    [0] => Array
        (
            [news_id] => 131825
            [news_title_telugu_html] => 

యుద్ధాలకు జంతువులు కారణమవుతాయా?

[news_sections] => ,1102, [news_title_telugu] => యుద్ధాలకు జంతువులు కారణమవుతాయా? [main_news_image] => [news_title_english] => The U.S. And Britain Went To War Over A Pig [news_short_description_html] =>

ఆధిపత్యం కోసం, ప్రతికారం కోసం, అందమైన యువరాణిల కోసం జరిగిన యుద్ధాలు చరిత్రలో అనేకం. రామాయణ, మహాభారతం నాటి నుంచి నేటి వరకు ఎన్నో యుద్ధాలు ఇలాంటి కారణాల వల్లే జరిగాయి. కానీ జంతువుల

[news_image] => [news_short_description] => ఆధిపత్యం కోసం, ప్రతికారం కోసం, అందమైన యువరాణిల కోసం జరిగిన యుద్ధాలు చరిత్రలో అనేకం. రామాయణ, మహాభారతం నాటి నుంచి నేటి వరకు ఎన్నో యుద్ధాలు ఇలాంటి కారణాల వల్లే జరిగాయి. కానీ జంతువుల [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-07-26 11:19:02 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => war,usa,britain,bulgaria,greece,dog,pig ) [1] => Array ( [news_id] => 129209 [news_title_telugu_html] =>

పుకార్లు పుట్టిస్తే... చెత్త ఎత్తాల్సిందే!

[news_sections] => ,1102, [news_title_telugu] => పుకార్లు పుట్టిస్తే... చెత్త ఎత్తాల్సిందే! [main_news_image] => [news_title_english] => Filipino Town Bans Gossip in Bid to Stop Rumors from Spreading [news_short_description_html] =>

పుకార్లు... బుల్లెట్‌ కన్నా వేగంగా పయనిస్తాయి. వాస్తవం కన్నా ముందే బట్వాడా అయిపోతాయి. అసలు నిజం బయటపడేవరకు హల్‌చల్‌ చేస్తాయి. కొందరికి పుకార్లు వినోదాత్మకంగా కనిపించినా.. మరికొందరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఒకప్పుడు ఇద్దరు కలిసి చెవులుకొరుక్కుంటే

[news_image] => [news_short_description] => పుకార్లు... బుల్లెట్‌ కన్నా వేగంగా పయనిస్తాయి. వాస్తవం కన్నా ముందే బట్వాడా అయిపోతాయి. అసలు నిజం బయటపడేవరకు హల్‌చల్‌ చేస్తాయి. కొందరికి పుకార్లు వినోదాత్మకంగా కనిపించినా.. మరికొందరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఒకప్పుడు ఇద్దరు కలిసి చెవులుకొరుక్కుంటే [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-07-26 09:17:04 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => ) [2] => Array ( [news_id] => 128799 [news_title_telugu_html] =>

లైబ్రరీలో పుస్తకాలతోపాటు చాలా ఉంటాయ్‌

[news_sections] => ,1102, [news_title_telugu] => లైబ్రరీలో పుస్తకాలతోపాటు చాలా ఉంటాయ్‌ [main_news_image] => [news_title_english] => library helping to poor people [news_short_description_html] =>

లైబ్రరీ అంటే పుస్తకాల భాండాగారం. మనిషికి ఎంతో జ్ఞానాన్ని అందించే అనేక రకాల పుస్తకాలు, గ్రంథాలు లభించే చోటు. ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడికి వెళ్లి నివృత్తి చేసుకోవచ్చు. కానీ.. అమెరికా ఒహాయోలోని సిన్సినాటి పట్టణంలో

[news_image] => [news_short_description] => లైబ్రరీ అంటే పుస్తకాల భాండాగారం. మనిషికి ఎంతో జ్ఞానాన్ని అందించే అనేక రకాల పుస్తకాలు, గ్రంథాలు లభించే చోటు. ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడికి వెళ్లి నివృత్తి చేసుకోవచ్చు. కానీ.. అమెరికా ఒహాయోలోని సిన్సినాటి పట్టణంలో [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-07-26 09:42:34 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => library,ohio ) [3] => Array ( [news_id] => 116515 [news_title_telugu_html] =>

ప్రఖ్యాత ప్రదేశాలు.. అత్యంత రహస్యాలు!

[news_sections] => ,1102, [news_title_telugu] => ప్రఖ్యాత ప్రదేశాలు.. అత్యంత రహస్యాలు! [main_news_image] => [news_title_english] => Super Secret Spaces Hidden in Famous Landmarks [news_short_description_html] =>

‘రహస్యం’.. ఈ పదం వినగానే మనలో ఏదో తెలియని ఆసక్తి.. దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత. మనం రోజూ కొన్ని వస్తువులను, ప్రదేశాలను చూస్తుంటాం....

[news_image] => [news_short_description] => ‘రహస్యం’.. ఈ పదం వినగానే మనలో ఏదో తెలియని ఆసక్తి.. దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత. మనం రోజూ కొన్ని వస్తువులను, ప్రదేశాలను చూస్తుంటాం.... [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-06-25 11:16:57 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => Secret,America,washington ) [4] => Array ( [news_id] => 111614 [news_title_telugu_html] =>

గుండె గుభేల్‌మన్నా..చెర్నోబిల్‌ చూడాల్సిందే..

[news_sections] => ,1102, [news_title_telugu] => గుండె గుభేల్‌మన్నా..చెర్నోబిల్‌ చూడాల్సిందే.. [main_news_image] => [news_title_english] => Chernobyl disaster [news_short_description_html] =>

చెర్నోబిల్‌... గుర్తుందా. 1986లో ఇక్కడి అణువిద్యుత్‌ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఈ ప్రాంతం పేరు యావత్‌ ప్రపంచానికి వెల్లడయింది.  అప్పటి సోవియట్‌ రష్యా, ఇప్పటి ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉన్న చెర్నోబిల్‌లో అణువిద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పారు....

[news_image] => [news_short_description] => చెర్నోబిల్‌... గుర్తుందా. 1986లో ఇక్కడి అణువిద్యుత్‌ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఈ ప్రాంతం పేరు యావత్‌ ప్రపంచానికి వెల్లడయింది.  అప్పటి సోవియట్‌ రష్యా, ఇప్పటి ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉన్న చెర్నోబిల్‌లో అణువిద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పారు.... [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-06-14 12:15:54 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => chernobyl,Chernobyl disaster,Soviet Union,nuclear accident ) [5] => Array ( [news_id] => 111172 [news_title_telugu_html] =>

నేలమీద నడిచినట్టే సముద్రం అడుగున నడుస్తారు..

[news_sections] => ,1102, [news_title_telugu] => నేలమీద నడిచినట్టే సముద్రం అడుగున నడుస్తారు.. [main_news_image] => [news_title_english] => bajau tribe [news_short_description_html] =>

నీటిలో ఈదాలంటే మనకు ఈత రావాలి. అదే సముద్రంలో ఈత కొట్టాలంటే ఈతలో నైపుణ్యం ఉండాలి....

[news_image] => [news_short_description] => నీటిలో ఈదాలంటే మనకు ఈత రావాలి. అదే సముద్రంలో ఈత కొట్టాలంటే ఈతలో నైపుణ్యం ఉండాలి.... [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-06-13 09:29:53 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => bajau tribe,southeast asia ) [6] => Array ( [news_id] => 108901 [news_title_telugu_html] =>

అక్కడ పర్యాటకుల్ని పెళ్లిచేసుకోవచ్చు కానీ..

[news_sections] => ,1102, [news_title_telugu] => అక్కడ పర్యాటకుల్ని పెళ్లిచేసుకోవచ్చు కానీ.. [main_news_image] => [news_title_english] => You Can Marry A Local In Amsterdam For A Day Also Get To Explore City On Your Honeymoon [news_short_description_html] =>

ఒక్క రోజు కోసమే అయితే ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు.. అనుకుంటున్నారా?నెదర్లాండ్స్‌ పర్యటక శాఖ తీసుకున్న నిర్ణయం ఇది. అసలు విషయం ఏంటంటే.. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యాం నగరంలో జనాభా

[news_image] => [news_short_description] => ఒక్క రోజు కోసమే అయితే ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు.. అనుకుంటున్నారా?నెదర్లాండ్స్‌ పర్యటక శాఖ తీసుకున్న నిర్ణయం ఇది. అసలు విషయం ఏంటంటే.. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యాం నగరంలో జనాభా [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-06-07 18:43:20 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => amsterdam,tourism ) [7] => Array ( [news_id] => 71173 [news_title_telugu_html] =>

గంటల తరబడి కాదు.. రోజుల తరబడి

[news_sections] => ,1102, [news_title_telugu] => గంటల తరబడి కాదు.. రోజుల తరబడి [main_news_image] => [news_title_english] => longest traffic jams in world [news_short_description_html] =>

ట్రాఫిక్‌.. ఈ పేరు వినగానే సగంమందికి అలసట వచ్చేస్తుంది. స్కూల్‌, కాలేజీ, ఆఫీస్‌, సినిమా... ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా కొంచెం ముందే బయలుదేరుతాం. ఎందుకంటే ట్రాఫిక్‌లో చిక్కుకుని ఎక్కడ ఆలస్యమైపోతుందేమోనన్న భయం.

[news_image] => [news_short_description] => ట్రాఫిక్‌.. ఈ పేరు వినగానే సగంమందికి అలసట వచ్చేస్తుంది. స్కూల్‌, కాలేజీ, ఆఫీస్‌, సినిమా... ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా కొంచెం ముందే బయలుదేరుతాం. ఎందుకంటే ట్రాఫిక్‌లో చిక్కుకుని ఎక్కడ ఆలస్యమైపోతుందేమోనన్న భయం. [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-03-22 15:47:07 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => traffic,cars,worldwide ) [8] => Array ( [news_id] => 70095 [news_title_telugu_html] =>

ఈ కేఫ్‌ కునుకు తీసేందుకే..

[news_sections] => ,1102, [news_title_telugu] => ఈ కేఫ్‌ కునుకు తీసేందుకే.. [main_news_image] => [news_title_english] => Nescafe-Sleep-Cafe-Offering-Naps-service [news_short_description_html] =>

రాత్రి నిద్ర సరిగా లేకనో, భోజనం తిన్నాకనో పగటిపూట కునుకు రావడం సహజం. అయితే అది ఉద్యోగులను చాలా ఇబ్బంది పెట్టే విషయం. ఒక అరగంట సేపు కునుకు తీద్దామనుకున్నా ఆఫీసులో అలాంటివి అస్సలు కుదరదు. పోనీ ఇంటికెళ్దామా అంటే అరగంట, గంట నిద్ర కోసం ఆఫీసుకు సగం పూట...

[news_image] => [news_short_description] => రాత్రి నిద్ర సరిగా లేకనో, భోజనం తిన్నాకనో పగటిపూట కునుకు రావడం సహజం. అయితే అది ఉద్యోగులను చాలా ఇబ్బంది పెట్టే విషయం. ఒక అరగంట సేపు కునుకు తీద్దామనుకున్నా ఆఫీసులో అలాంటివి అస్సలు కుదరదు. పోనీ ఇంటికెళ్దామా అంటే అరగంట, గంట నిద్ర కోసం ఆఫీసుకు సగం పూట... [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-03-20 12:37:07 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => japan,cafe,sleep ) [9] => Array ( [news_id] => 68339 [news_title_telugu_html] =>

ఈ గుడికి వెళ్లారంటే ‘బంధం’ తెగినట్లే!

[news_sections] => ,1102, [news_title_telugu] => ఈ గుడికి వెళ్లారంటే ‘బంధం’ తెగినట్లే! [main_news_image] => [news_title_english] => Visit japan`s Yasui Konpiragu for breakup [news_short_description_html] =>

దేవాలయాలకు వెళ్తే సాధారణంగా మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమని, మంచి ఉద్యోగం లభించేలా చేయమని, అందరితో బంధాలు చక్కగా ఉండేలా చూడమని దేవుళ్లను కోరుకుంటాం...

[news_image] => [news_short_description] => దేవాలయాలకు వెళ్తే సాధారణంగా మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమని, మంచి ఉద్యోగం లభించేలా చేయమని, అందరితో బంధాలు చక్కగా ఉండేలా చూడమని దేవుళ్లను కోరుకుంటాం... [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-03-16 12:57:50 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => japan,breakup,lovers,relation ) [10] => Array ( [news_id] => 24728 [news_title_telugu_html] =>

వూరికి చేయాల్సింది చాలావుంది.. 

[news_sections] => ,1102, [news_title_telugu] => వూరికి చేయాల్సింది చాలావుంది..  [main_news_image] => [news_title_english] => my place [news_short_description_html] =>

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.. వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌.. అన్నారు మహాకవి గురజాడ. అంటే మాటల్తో సరిపెట్టకుండా మనకు చేతనయిన మేలును పదిమందికి...

[news_image] => [news_short_description] => దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.. వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌.. అన్నారు మహాకవి గురజాడ. అంటే మాటల్తో సరిపెట్టకుండా మనకు చేతనయిన మేలును పదిమందికి... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-17 18:37:17 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => my place ) [11] => Array ( [news_id] => 24727 [news_title_telugu_html] =>

సొంత గ్రామానికి ప్రవాస డాక్టర్‌ సేవ 

[news_sections] => ,1102, [news_title_telugu] => సొంత గ్రామానికి ప్రవాస డాక్టర్‌ సేవ  [main_news_image] => [news_title_english] => My place [news_short_description_html] =>

కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండలం సాతారం గ్రామానికి చెందిన గండ్ర విద్యాధర్‌రావు వృత్తిరీత్యా హృద్రోగ వైద్య నిపుణుడు. గత 15 సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్డియాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడినప్పటికీ ...

[news_image] => [news_short_description] => కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండలం సాతారం గ్రామానికి చెందిన గండ్ర విద్యాధర్‌రావు వృత్తిరీత్యా హృద్రోగ వైద్య నిపుణుడు. గత 15 సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్డియాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడినప్పటికీ ... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-17 18:37:08 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => My place ) [12] => Array ( [news_id] => 24726 [news_title_telugu_html] =>

సొంతూరి బాగుకోసం... 

[news_sections] => ,1102, [news_title_telugu] => సొంతూరి బాగుకోసం...  [main_news_image] => [news_title_english] => My place [news_short_description_html] =>

‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అన్న కరుణామయి మదర్‌థెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారాయన. చిన్నవయసులోనే యూఎస్‌లో ఉద్యోగం సంపాదించి పుట్టిన వూరికి...

[news_image] => [news_short_description] => ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అన్న కరుణామయి మదర్‌థెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారాయన. చిన్నవయసులోనే యూఎస్‌లో ఉద్యోగం సంపాదించి పుట్టిన వూరికి... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-18 05:52:08 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => My place ) [13] => Array ( [news_id] => 24725 [news_title_telugu_html] =>

మంచి నీరు అందించడంలో ‘రాజీ’ లేదు! 

[news_sections] => ,1102, [news_title_telugu] => మంచి నీరు అందించడంలో ‘రాజీ’ లేదు!  [main_news_image] => [news_title_english] => My place [news_short_description_html] =>

ప్రాణాధారమైన తాగునీటి కోసం దేశంలో ఎన్నో వూళ్లు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇక స్వచ్ఛమైన మంచినీరు దొరికే పరిస్థితి చాలా చోట్ల కనుమరుగవుతోంది. ఇలాంటి పరిస్థితే ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ...

[news_image] => [news_short_description] => ప్రాణాధారమైన తాగునీటి కోసం దేశంలో ఎన్నో వూళ్లు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇక స్వచ్ఛమైన మంచినీరు దొరికే పరిస్థితి చాలా చోట్ల కనుమరుగవుతోంది. ఇలాంటి పరిస్థితే ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-17 18:36:45 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => My place ) [14] => Array ( [news_id] => 24724 [news_title_telugu_html] =>

వూరికోసం గుడి,బడి 

[news_sections] => ,1102, [news_title_telugu] => వూరికోసం గుడి,బడి  [main_news_image] => [news_title_english] => My place [news_short_description_html] =>

పుట్టిన వూరికోసం కొంతైనా చేయాలని విద్యార్థుల కోసం బడి, భక్తుల కోసం గుడి లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ కన్నతల్లి రుణం కొంత...

[news_image] => [news_short_description] => పుట్టిన వూరికోసం కొంతైనా చేయాలని విద్యార్థుల కోసం బడి, భక్తుల కోసం గుడి లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ కన్నతల్లి రుణం కొంత... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-17 18:36:24 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => My place ) [15] => Array ( [news_id] => 24723 [news_title_telugu_html] =>

మాతృభాషపై మమకారం 

[news_sections] => ,1102, [news_title_telugu] => మాతృభాషపై మమకారం  [main_news_image] => [news_title_english] => My place [news_short_description_html] =>

‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..’ అని అన్నారు రాయప్రోలు సుబ్బారావు. అది మర్చిపోవద్దురా ఏనాడు...

[news_image] => [news_short_description] => ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..’ అని అన్నారు రాయప్రోలు సుబ్బారావు. అది మర్చిపోవద్దురా ఏనాడు... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-17 18:36:15 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => My place ) [16] => Array ( [news_id] => 24722 [news_title_telugu_html] =>

సొంతవూరిపై మమకారంతో.. 

[news_sections] => ,1102, [news_title_telugu] => సొంతవూరిపై మమకారంతో..  [main_news_image] => [news_title_english] => My place [news_short_description_html] =>

విదేశాల్లో స్థిరపడినా సొంతవూరిపై మమకారంతో తమ ప్రజల మేలు కొరుతూ అనేకమంది ఎన్నారైలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. వీరిలో నల్గొండ జిల్లా సుంకిశాలకు చెందిన ఎన్నారై డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి ముందు...

[news_image] => [news_short_description] => విదేశాల్లో స్థిరపడినా సొంతవూరిపై మమకారంతో తమ ప్రజల మేలు కొరుతూ అనేకమంది ఎన్నారైలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. వీరిలో నల్గొండ జిల్లా సుంకిశాలకు చెందిన ఎన్నారై డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి ముందు... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-17 18:36:05 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => My place ) [17] => Array ( [news_id] => 24721 [news_title_telugu_html] =>

స్వగ్రామం అభివృద్ధికి కృషి 

[news_sections] => ,1102, [news_title_telugu] => స్వగ్రామం అభివృద్ధికి కృషి  [main_news_image] => [news_title_english] => My place [news_short_description_html] =>

మధ్యప్రాచ్యంలోని దుబాయ్‌లో సివిల్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డ మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన కొండపల్కుల రాంమోహన్‌రావు స్వగ్రామం అభివృద్ధి కోసం తన తండ్రి రంగారావుపేర పలు అభివృద్ధి...

[news_image] => [news_short_description] => మధ్యప్రాచ్యంలోని దుబాయ్‌లో సివిల్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డ మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన కొండపల్కుల రాంమోహన్‌రావు స్వగ్రామం అభివృద్ధి కోసం తన తండ్రి రంగారావుపేర పలు అభివృద్ధి... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-17 18:35:51 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => My place ) [18] => Array ( [news_id] => 24720 [news_title_telugu_html] =>

ప్రతి ఏటా విరాళం.. ఎందరికో ప్రోత్సాహం 

[news_sections] => ,1102, [news_title_telugu] => ప్రతి ఏటా విరాళం.. ఎందరికో ప్రోత్సాహం  [main_news_image] => [news_title_english] => My place [news_short_description_html] =>

ఆ పాఠశాలలో అ, ఆలు దిద్దిదిన ఆ చేతులే నేడు పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా సాయపడుతున్నాయి. అమెరికాలో స్థిరపడిన ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గుండె...

[news_image] => [news_short_description] => ఆ పాఠశాలలో అ, ఆలు దిద్దిదిన ఆ చేతులే నేడు పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా సాయపడుతున్నాయి. అమెరికాలో స్థిరపడిన ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గుండె... [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-17 18:08:41 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => My place ) [19] => Array ( [news_id] => 24351 [news_title_telugu_html] =>

గ్రామాభివృద్ధికి ఎన్నారైల చేయూత 
 

[news_sections] => ,1102, [news_title_telugu] => గ్రామాభివృద్ధికి ఎన్నారైల చేయూత    [main_news_image] => [news_title_english] => nri news [news_short_description_html] =>

కనిపెంచిన అమ్మ.. పుట్టి పెరిగిన వూరు.. స్వర్గం కంటే ఎక్కువే.. అందుకే ‘జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’ అన్నారు. కన్నతల్లి లాంటి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వారు కంకణబద్ధులయ్యారు. సొంత వూరికి మేలు చేయాలన్న తలంపుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
మద్దికెర మాజీ సర్పంచి అర్దగేరి రామకృష్ణారెడ్డి కుటుంబ

[news_image] => [news_short_description] => కనిపెంచిన అమ్మ.. పుట్టి పెరిగిన వూరు.. స్వర్గం కంటే ఎక్కువే.. అందుకే ‘జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’ అన్నారు. కన్నతల్లి లాంటి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వారు కంకణబద్ధులయ్యారు. సొంత వూరికి మేలు చేయాలన్న తలంపుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  మద్దికెర మాజీ సర్పంచి అర్దగేరి రామకృష్ణారెడ్డి కుటుంబ [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2018-10-15 12:31:48 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => nri news ) )
యుద్ధాలకు జంతువులు కారణమవుతాయా? - The U.S. And Britain Went To War Over A Pig - EENADU
close
యుద్ధాలకు జంతువులు కారణమవుతాయా?

ఆధిపత్యం కోసం, ప్రతికారం కోసం, అందమైన యువరాణిల కోసం జరిగిన యుద్ధాలు చరిత్రలో అనేకం. రామాయణ, మహాభారతం నాటి నుంచి నేటి వరకు ఎన్నో యుద్ధాలు ఇలాంటి కారణాల వల్లే జరిగాయి. కానీ జంతువుల వల్ల దేశాల మధ్య యుద్ధాలు జరిగాయంటే నమ్ముతారా? ఓ కుక్క వల్ల గ్రీస్‌, బల్గేరియా యుద్ధం చేశాయి. పంది వల్ల అమెరికా, బ్రిటన్‌ పోరులో దిగాయి. వాటి గురించి వివరాలు ఇవిగో!

గ్రీస్‌-బల్గేరియా

1908కు ముందు గ్రీస్‌, బల్గేరియా మధ్య సత్సంబంధాలు ఉండేవి. కానీ దేశ సరిహద్దు విషయంలో ఇరు దేశాలు బద్ధశత్రువులగా వ్యవహరించేవి. అది కాస్తా మొదటి ప్రపంచయుద్ధం నాటికి తారస్థాయికి చేరింది. ఇరు దేశాలు వేర్వేరు వర్గాల్లో చేరి యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ తర్వాతి రోజుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ వచ్చాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో భద్రతా బలగాలను మోహరించాయి. ఈ క్రమంలో 1925లో అక్టోబర్‌ 18న గ్రీస్‌ సైనికుడికి చెందిన పెంపుడు కుక్క అతడి నుంచి తప్పించుకొని బల్గేరియా సరిహద్దు వైపుకు వెళ్లింది. దాన్ని వెంబడిస్తూ సరిహద్దు దాటి బల్గేరియాలోకి వెళ్లడంతో గ్రీస్‌ సైనికుడిపై బల్గేరియా  సైనికుడు కాల్పులు జరిపాడు. ఆ వెంటనే గ్రీస్‌ సైనికులు బల్గేరియాపై ఎదురుకాల్పులు జరిపారు.

దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. బల్గేరియా సైన్యం తమ తొందరపాటుకు క్షమాపణ చెప్పినా గ్రీస్‌ పట్టించుకోలేదు. తమ సైనికుడి మరణానికి కారణమైన వారికి శిక్ష, అధికార క్షమాపణ, రెండు మిలియన్‌ ఫ్రెంచ్‌ ఫ్రాంక్స్‌ పరిహారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అంతేకాదు గ్రీస్‌ తన సైన్యాన్ని బల్గేరియాలోని పెట్రిచ్‌ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని  యుద్ధం కొనసాగించింది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన దాదాపు వంద మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది సైనికులకు గాయాలయ్యాయి. దీంతో ‘లీగ్‌ ఆఫ్‌ నేషన్‌’ సంస్థ జోక్యం చేసుకొని ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చర్యలు చేపట్టింది. కాల్పులు ఉపసంహరించడంతోపాటు బల్గేరియాలోని గ్రీస్‌ సైనికులను పెట్రిచ్‌ నుంచి వెనక్కి పిలవాలని గ్రీస్‌ను ఆదేశించింది. దీంతోపాటు 45వేల పౌండ్లు బల్గేరియాకు చెల్లించాలని ఆదేశించింది. దీంతో గ్రీస్‌, బల్గేరియా యుద్ధం ఉపసంహరించుకున్నాయి.

యూఎస్‌ఏ-యూకె

నార్త్‌ అమెరికా, బ్రిటన్‌కు ఒకప్పుడు భూ తగాదాలు ఉండేవి. 1846లో జరిగిన ఒరెగాన్‌ ఒప్పందం ప్రకారం ఒరెగాన్‌ దేశానికి ఆనుకొని పర్వతాలున్న కోస్తా ప్రాంతాన్ని అమెరికా, బ్రిటన్‌కు విభజించి ఇచ్చారు. అయితే సాన్‌ జువాన్‌ ఛానెల్‌ ఐలాండ్‌పై సార్వభౌమాధికారాలు ఇరు దేశాలు పంచుకున్నాయి. దీంతో అయిష్టంగానే 13 ఏళ్లపాటు అమెరికా, బ్రిటన్‌ ప్రజలు ఆ ఐలాండ్‌లో జీవించారు. బ్రిటన్‌ ప్రభుత్వం కూడా ఈ ఐలాండ్‌లో హుడ్సన్స్‌ బే కంపెనీని స్థాపించింది. అక్కడ బ్రిటీష్‌ పౌరులు చాలా మంది ఉద్యోగం చేసేవాళ్లు. అయితే 1859 జూన్‌ 15న అమెరికన్‌ రైతు అయిన లీమన్‌ కట్లర్‌ పొలంలోని బంగాళాదుంపలను తింటున్న ఓ పందిని చూసి చంపేశాడు. అయితే ఆ పంది బ్రిటన్‌కు చెందిన ఉద్యోగి చార్లెస్‌ గ్రిఫిన్‌ది కావడంతో అగ్గి రాజుకుంది. కట్లర్‌ను అరెస్టు చేయాలని కోరుతూ చార్లెస్‌ బ్రిటన్‌ అధికారులను కోరాడు. దీంతో కట్లర్‌కు రక్షణ కల్పించాలని కోరుతూ అతడి స్నేహితుడు అప్పటి యూఎస్‌ జనరల్‌ విలియమ్‌ ఎస్‌. హెర్నీకి విజ్ఞప్తి చేశాడు. 

 బ్రిటీష్‌ వారిని హెర్నీ బద్ధ శత్రులువుగా భావించేవాడు. అందుకే కట్లర్‌ రక్షణ కోసం 66 మంది అమెరికా సైనికులను సాన్‌ జువాన్‌ ఐలాండ్‌కు పంపించాడు. బ్రిటీష్‌ సైన్యం ఈ చర్యను తీవ్రంగా పరిగణించింది. అమెరికన్లపై యుద్ధం ప్రకటించి ఐదు యుద్ధనౌకలను ఐలాండ్‌కు పంపించింది. ఈ విషయం తెలుసుకొని 400 మంది అమెరికన్‌ సైనికులు ఫిరంగులతో సహా బిట్రన్‌ యుద్ధనౌకలు వచ్చిన ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయం ఇరుదేశాల ప్రభుత్వాల దృష్టికి వెళ్లింది. వెంటనే ఇరు వర్గాలు యుద్ధాన్ని విరమించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఐలాండ్‌లో ఇరు దేశాలు భద్రతా బలగాలను మోహరించాయి. 1872లో జర్మనీ మధ్యవర్తిత్వంతో సాన్‌ జువాన్‌ ఐలాండ్‌ అమెరికా వశమైంది. దీంతో బ్రిటన్‌ తమ బలగాలను వెనక్కి పిలుచుకుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

పుకార్లు పుట్టిస్తే... చెత్త ఎత్తాల్సిందే!

పుకార్లు... బుల్లెట్‌ కన్నా వేగంగా పయనిస్తాయి. వాస్తవం కన్నా ముందే బట్వాడా అయిపోతాయి. అసలు నిజం బయటపడేవరకు హల్‌చల్‌ చేస్తాయి. కొందరికి పుకార్లు వినోదాత్మకంగా కనిపించినా.. మరికొందరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఒకప్పుడు ఇద్దరు కలిసి చెవులుకొరుక్కుంటే పుట్టిన పుకార్లు ఒక ప్రాంతానికే పరిమితమయ్యేవి. ఇప్పుడు వార్తలు, సోషల్‌మీడియా అంటూ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిని అరికట్టడం కష్టసాధ్యం. కానీ ఆ దిశగా ఫిలిప్పిన్‌లోని ఓ పట్టణం అడుగులేసింది.

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాకి 200కి.మీ దూరంలో ఉన్న చిన్న పట్టణం బినలొనన్‌. గతంలో అక్కడ విపరీతంగా పుకార్లు సృష్టించేవారట. దీంతో వీటిని ఎలాగైన అరికట్టాలని భావించిన స్థానిక ప్రభుత్వం ఏకంగా పుకార్లను నిషేధిస్తూ ఓ చట్టం తీసుకొచ్చింది. ఇకపై ఈ పట్టణంలో ఎవరైనా పుకార్లు సృష్టించినా.. వాటిని ప్రచారం చేసినా నేరంలా పరిగణిస్తామని ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తాము చేసిన వ్యాఖ్యలపై బాధ్యత వహించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 
ఈ చట్టం ప్రకారం మొదటిసారి పుకార్లు సృష్టించి పట్టుబడ్డ వ్యక్తికి తక్కువ మొత్తంలో (రూ.264) జరిమానా విధించడంతోపాటు మూడు గంటల పాటు వీధుల్లో చెత్త సేకరించేలా శిక్ష విధిస్తారు. 

ఒక్కటి కంటే ఎక్కువ సార్లు పుకార్లు పుట్టిస్తూ పట్టుబడితే 20 డాలర్లు జరిమానా విధించి.. 8 గంటలు సమాజ సేవ చేసేలా చూస్తారట. అయితే వేటిని పుకార్లుగా పరిగణించాలన్న దానిపై స్పష్టత లేకపోయినా.. స్థానిక ప్రజల సంబంధాలపై, ఆర్థికపరమైన అంశాలు, ఇతరులను ఇబ్బందికి గురిచేసేవేవైనా పుకార్ల కిందకే వస్తాయని పట్టణ మేయర్‌ చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ చట్టాన్ని 2017లోనే మొరెనో ప్రాంతంలో అమలు చేశారు. పుకార్లు సృష్టిస్తున్న వారికి 10 డాలర్లు జరిమానా విధించేవాళ్లు. మధ్యాహ్నం వేళ చెత్తను సేకరించేలా శిక్ష విధించారు. దీనికి మంచి ఫలితాలు వచ్చాయట. జరిమానా పడ్డవాళ్లు మళ్లీ పుకార్లు సృష్టంచడానికి, ప్రచారం చేయడానికి పూనుకోలేదట. దీంతో ఆ చట్టాన్ని  బినలొనన్‌ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

 

లైబ్రరీలో పుస్తకాలతోపాటు చాలా ఉంటాయ్‌

లైబ్రరీ అంటే పుస్తకాల భాండాగారం. మనిషికి ఎంతో జ్ఞానాన్ని అందించే అనేక రకాల పుస్తకాలు, గ్రంథాలు లభించే చోటు. ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడికి వెళ్లి నివృత్తి చేసుకోవచ్చు. కానీ.. అమెరికా ఒహాయోలోని సిన్సినాటి పట్టణంలో ఉన్న లైబ్రరీకి మాత్రం తలదాచుకోవడానికి, స్నానాలు చేయడానికి, ఉద్యోగం వెతుక్కొవడానికి వెళ్తుంటారు. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి..

అనాథలు, నిరాశ్రయుల కోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతుంటాయి. అయినా పేదలకు స్వచ్ఛందంగా సేవ చేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తుంటాయి. ఆ కోవలోనిదే సిన్సినాటిలోని పబ్లిక్‌ లైబ్రరీ. పుస్తకాలు చదువుకునేందుకు వచ్చే వారితోపాటు నిరాశ్రయులకు ఈ లైబ్రరీ ద్వారాలు తెరుస్తోంది. గూడు లేని పేదలకు చిరునామాగా మారుతోంది. ఎండ, వాన, చలిని తప్పించుకునేందుకు ఆశ్రయం కల్పిస్తోంది. 

రోడ్డుపై బతుకు వెళ్లదీసే వారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నిర్వాహకులు లైబ్రరీలో ప్రాంగణంలో మరుగుదొడ్లు, స్నానాల గదులను ఏర్పాటు చేశారు. వారి కనీస అవసరాలు తీరేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంతటితో ఈ పబ్లిక్‌ లైబ్రరీ తమ సేవలు ఆపేయలేదు. నిరాశ్రయులకు ఉపయోగపడేలా ఇటీవల ఓ కార్యక్రమం చేపట్టింది. తమ లైబ్రరీకి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా మానసిక నిపుణులతో సెమినార్‌ ఏర్పాటు చేస్తోంది. నిరుద్యోగుల కోసం కంప్యూటర్‌, వృత్తి విద్యా కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడంలో లైబ్రరీ సిబ్బంది సహాయపడుతున్నారు. చదువురాని నిరాశ్రయులు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వారి కోసం టికెట్లు బుక్‌ చేస్తారు. ఇలా ఆసరా కోసం వచ్చిన వారితోపాటు జైలు జీవితం గడిపి విడుదలైన ఖైదీలకు కూడా ఈ లైబ్రరీ చేయందించి.. వాళ్ల కాళ్లపైవాళ్లు నిలబడే వరకు తోడుగా ఉంటోంది. 

ప్రఖ్యాత ప్రదేశాలు.. అత్యంత రహస్యాలు!

‘రహస్యం’.. ఈ పదం వినగానే మనలో ఏదో తెలియని ఆసక్తి.. దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత. మనం రోజూ కొన్ని వస్తువులను, ప్రదేశాలను చూస్తుంటాం. అందులో ఓ రహస్యం ఉందని తెలియగానే.. దానిని ఛేదించే వరకు మళ్లీ మళ్లీ దానిని చూడాలని మనసు ఆరాటపడుతుంది. అలాంటిది ప్రపంచ అద్భుత కట్టడాల్లోనే రహస్యాలున్నాయని ఎవరో చెబితే..! అది నిజమని తెలిసిస్తే.. మరుక్షణం ముక్కున వేలేసుకోక తప్పదు. అలాంటి ప్రదేశాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయట. అవేంటో చూసేద్దామా..?

ఈఫిల్‌ టవర్‌లో వ్యక్తిగత గది

ఈఫిల్‌ టవర్‌ అనగానే ఓ ఎత్తైన కట్టడం మన కళ్లముందు కదలాడుతుంది.  ఫ్రాన్స్‌లోని పారిస్‌ నగరంలో గస్టవ్‌ ఈఫెల్‌ అనే వ్యక్తి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. సాధారణంగా అందరికీ ఇదే విషయం తెలుసు. కానీ, ఆ టవర్‌ చివరి భాగాన ఈఫిల్‌  తన కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించుకున్నాడట. ఆయనకు తప్ప ఆ గదిలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. ఆయన బతికున్న రోజుల్లో అందులోకి ప్రవేశించిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో థామస్‌ ఎడిసన్‌ ఒకరు. ఈఫిల్‌ కన్నుమూసిన తర్వాత కూడా అందులోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. కానీ, ఆ గది కిటికీ నుంచి లోపలికి చూసే అవకాశం ఉంది. దీనికి కోసం ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు.

మౌంట్‌ రష్‌మోర్‌లో మరో రహస్యం

అమెరికాకు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన  అబ్రహాం లింకన్, వాషింగ్టన్‌, థామస్‌ జఫర్‌సన్‌, థియోడర్‌  రూజ్‌వెల్ట్‌ శిల్పాలతో కూడిన ఓ కట్టడాన్ని గుట్జన్‌ బోర్గ్‌లమ్‌ అనే శిల్పి నిర్మించారు. దీనిలో అమెరికా మాజీ అధ్యక్షుడైన అబ్రహం లింకన్‌ శిల్పం వెనుక భాగంలో ఓ గదిని నిర్మించారు. అమెరికా చరిత్ర, ఆ దేశానికి చెందిన ప్రముఖ పత్రాలను అప్పట్లో ఆ గదిలో భద్రపరచాలనుకున్నారు. కానీ, అది కుదరలేదు. ప్రస్తుతం ఆ గదిని ఖాళీగా  ఉంచేశారు. అందులోకి ప్రస్తుతం ఎవ్వరినీ అనుమతించడం లేదు.

రైల్వే స్టేషన్‌లో టెన్నిస్‌ కోర్టు

న్యూయార్క్‌లో అత్యంత రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్లలో గ్రాండ్‌ సెంట్రల్‌ టెర్మినల్‌ ఒకటి. అందులో ఒకప్పుడు టెన్నిస్‌ కోర్టు ఉండేది. దీనిని అన్నెక్స్‌ అని పిలుస్తారు. కానీ, అధునీకరణ పనుల్లో క్రమంగా అది మరుగున పడిపోయింది. ప్రస్తుతం దానిని రికార్డింగ్‌ స్టూడియోగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతం అందర్నీ అనుమతిస్తున్నప్పటికీ.. దాని చరిత్ర గురించి మాత్రం చాలా మందికి  తెలియదు.

సుప్రీం కోర్టులో బాస్కెట్‌బాల్‌ కోర్టు

అది అమెరికా అత్యున్నత న్యాయస్థానం. వివిధ కేసుల నిమిత్తం చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు అక్కడికి వస్తుంటారు. అక్కడి వాతావరణమంతా బిజీబిజీగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో బాస్కెట్‌ బాల్ కోర్టు ఉందంటే నమ్ముతారా? నిజమే.. అమెరికా సుప్రీం కోర్టు భవనం చివరి అంతస్తులో ఓ బాస్కెట్‌ బాల్‌ కోర్టు ఉంది. అక్కడ క్లర్కులు, ఆఫ్‌ డ్యూటీ పోలీసు అధికారులు బాస్కెట్‌ బాల్‌ ఆడుతుంటారట. సుప్రీం కోర్టు సిబ్బంది తప్ప ఇతర వ్యక్తులెవ్వరినీ అక్కడికి అనుమతించరు.

లింకన్‌ విగ్రహం కింద ఓ చర్చి!

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ భారీ విగ్రహాన్ని వాషింగ్టన్‌లో నిర్మించారు. లింకన్‌ మెమోరియల్‌ పేరిట నిర్మించిన  విగ్రహం అడుగుభాగం దాదాపు 43,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 1914లో ఈ కట్టడం నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పట్లో విగ్రహం దిగువ ఉన్న ఖాళీ స్థలాన్ని అలాగే ఉంచేశారు. కానీ, 1975లో  పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఆ ఖాళీ స్థలంలో ఓ చర్చిని నిర్మించారు. అయితే ప్రస్తుతం ఇక్కడికి ఎవ్వరినీ అనుమతించడం లేదు.

ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌లో 103వ అంతస్తు..

అమెరికాలోని ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అమెరికాలోని అత్యద్భుత కట్టడాల్లో అదొకటి. అందరూ ఆ భవనంలో 102 అంతస్తులు మాత్రమే ఉంటాయనుకుంటారు. కానీ, చివరి భాగంలో మరో అంతస్తు కూడా ఉందట. అందులోకి కేవలం ఆ భవన నిర్వహణ చూస్తున్న ఇంజినీర్లకు, టేలర్‌ స్విఫ్ట్‌ లాంటి ప్రముఖులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ 

గుండె గుభేల్‌మన్నా..చెర్నోబిల్‌ చూడాల్సిందే..

చెర్నోబిల్‌... గుర్తుందా. 1986లో ఇక్కడి అణువిద్యుత్‌ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఈ ప్రాంతం పేరు యావత్‌ ప్రపంచానికి వెల్లడయింది.  అప్పటి సోవియట్‌ రష్యా, ఇప్పటి ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉన్న చెర్నోబిల్‌లో అణువిద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పారు. అయితే నిర్వహణలో వైఫల్యంతో 1986లో ప్రమాదం సంభవించింది.ఆ ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అక్కడ నుంచి వెలువడుతున్న అణుధార్మికతతో కనీసం 2 లక్షల మంది చనిపోయివుంటారని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. కానీ అప్పట్లో సోవియట్‌ యూనియన్‌ పాలనలో ఉండటంతో ప్రాణనష్టం అంశంపై సరైన గణాంకాలు లేవు.

టీవీ సీరియల్‌తో ఆసక్తిపెరిగింది.
 మూడు దశాబ్దాలకు పూర్వంజరిగిన ఈ ప్రమాదం గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. అయితే చెర్నోబిల్‌  టీవీ సీరియల్‌లో వస్తున్న కథనాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దీంతో వారు ఈ నగరాన్నిచూసేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు.

ఖాళీ నగరాన్ని చూడాల్సిందే..
ఉక్రెయిన్‌లోని ప్రిప్‌యత్‌ నగరానికి సమీపంలో ఉంటుందీ చెర్నోబిల్‌. ప్రమాదం జరిగిన వెంటనే నగరంలోని వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అణుధార్మికత ప్రభావంతో క్యాన్సర్‌.. తదితర వ్యాధులు వచ్చే ప్రమాదముండటంతో మొత్తం నగరాన్ని మూసివేశారు. ఇప్పటికీ పార్కులు, నివాసగృహాలు ఖాళీగా ఉన్నాయి. ప్రజలను అప్పటికప్పుడు తరలించడంతో వారు తమ వస్తువులను తీసుకెళ్లే సమయం కూడా లేకపోయింది. ఇప్పటికీ ఆ గుర్తులను చూడవచ్చు.

యంత్రాలకు స్మశానం ఉంది..
చెర్నోబిల్‌లో ప్రమాదం అనంతరం వేలాది యంత్రాలను, వాహనాలను, హెలికాప్టర్లను అలాగే వదిలివెళ్లిపో్యారు. ఇవి అక్కడే మట్టికొట్టుకుపోవడంతో మరుభూమిలాగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని యంత్రాల స్మశానం  అని పిలుస్తుంటారు.

పర్యాటకులు పెరుగుతున్నారు..
చెర్నోబిల్‌ సీరియల్‌ విశేష ప్రేక్షకాదరణ పొందింది.దీంతో అనేకమంది ఉక్రెయెన్‌కు వచ్చి చెర్నోబిల్‌ చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎక్కవమంది ఒక్కరోజు టూర్‌ కోసం వస్తున్నట్టు స్థానిక గైడ్‌లు తెలిపారు. చెర్నోబిల్‌ కేంద్రానికి 300 మీటర్ల దూరం వరకు మాత్రమే పర్యాటకులను అధికారులు అనుమతిస్తున్నారు. రేడియేషన్‌ ప్రమాదం లేకుండా ఉండేందుకు అందరు కచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందే. అయితే పర్యాటకులు వీటిని పాటించకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

నేలమీద నడిచినట్టే సముద్రం అడుగున నడుస్తారు..

నీటిలో ఈదాలంటే మనకు ఈత రావాలి. అదే సముద్రంలో ఈత కొట్టాలంటే ఈతలో నైపుణ్యం ఉండాలి. మరి సముద్ర అడుగుభాగంలో నడవాలంటే.. చాలా కష్టం. ఎవరో కొందరు గజ ఈతగాళ్లకు తప్ప సామాన్యులకు అసాధ్యమే. అయితే ఆగ్నేయాసియాలోని బజావు జాతికి చెందిన ప్రజలకు ఇది చాల చిన్నపని అని చెప్పవచ్చు. మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ సముద్రతీరాల్లో విస్తరించివున్న ఈ జాతి ప్రజలు సముద్రంపై ఆధారపడి జీవిస్తారు. దీంతో వీరి జీవితాల్లో ఈత అనేది ఒక భాగంగా మారిపోయింది.

13 నిమిషాలు ఊపిరి బిగబట్టి..

సముద్రతీరాల్లో జీవనం సాగించే వీరికి చిన్నప్పటినుంచే ఈత అలవాటవుతుంది. ఆహార అన్వేషణలో భాగంగా వీరు సముద్రం లోపలి వరకు వెళుతుంటారు . సాధారణంగా పెద్ద పెద్ద డైవర్లు సైతం ఆక్సిజన్‌లేకుండా మూడు నిమిషాల వరకు ఊపిరి బిగబట్టగలుగుతారు. అయితే బజావు తెగకు చెందినవారు కనీసం 13 నిమిషాల వరకు శ్వాసను అదుపులో ఉంచడం విశేషం.

200 అడుగుల కిందకు వరకు..

ఆహార అన్వేషణలో భాగంగా వీరు సముద్రంలో 200 అడుగుల కిందవరకు వెళుతారు. అక్కడ సముద్రగర్భంలోని నేలపై నడిచే నైపుణ్యత కూడా వీరికి ఉంది.దాదాపు ఎనిమిది గంటల పాటు వీరు డైవింగ్‌ చేస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిని తొలిసారిగా  15వ శతాబ్దంలో యూరప్‌కు చెందిన అన్వేషకులు గుర్తించారు. అప్పట్లోనే వీరి ఈత నైపుణ్యాలను గమనించినవారు ఆశ్చర్యపోయారు. 

సముద్రంపైనే నివాసం

వీరికి శాశ్వత నివాసం ఉండదు.తీరప్రాంతాల్లోనే సముద్రజలాలపై కట్టెలతో నిర్మించిన నివాసాల్లో నివసిస్తారు. సముద్రాన్ని పూజిస్తారు. సముద్ర ఉత్పత్తులు భారీగా దొరికే ప్రదేశాలకు వలసవెళుతుంటారు. దీంతో వీరికి సముద్రపు దిమ్మరులుగా పేరువచ్చింది. చెక్కతో చేసిన కంటి అద్దాలను ఈత కొట్టే సమయంలో వాడుతుంటారు. అంతకంటే వీరికి అధునాతన పరికరాలు ఉండవు. సముద్రంలోకి వెళ్లి చేపలు, ఆక్టోపస్‌, రొయ్యలు.. తదితర వాటిని వేటాడి పట్టుకొచ్చి విక్రయిస్తుంటారు. వీటితో పాటు ముత్యాలు, పగడాలను కూడా  సేకరిస్తారు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అక్కడ పర్యాటకుల్ని పెళ్లిచేసుకోవచ్చు కానీ..

ఒక్కరోజుకే..

ఆమ్‌స్టర్‌డ్యాం: ఒక్క రోజు కోసమే అయితే ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు.. అనుకుంటున్నారా? నెదర్లాండ్స్‌ పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం ఇది. అసలు విషయం ఏంటంటే.. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యాం నగరంలో జనాభా సంఖ్య పది లక్షలే. కానీ, ఈ నగరానికి ప్రస్తుతం వస్తున్న పర్యాటకుల సంఖ్య మాత్రం 19 మిలియన్లు దాటుతోంది. మరో పదేళ్లలో ఈ సంఖ్య 29 మిలియన్ల మార్క్‌కు దాటనుంది. దాంతో తమ ప్రాంతంలోకి పర్యాటకులు ఎక్కువైపోతున్నారని, ఇది ఓవర్‌ టూరిజంకు దారితీస్తోందిన స్థానికులు చింతిస్తున్నారట. దాంతో అటు పర్యాటకుల్లో ఇటు స్థానికుల్లో పాజిటివిటీని కలిగించేలా ‘అన్‌ టూరిస్ట్‌ గైడ్‌ టు ఆమ్‌స్టర్‌డ్యాం’ పేరిట పర్యాటక శాఖ ఒక్క రోజు పెళ్లి అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. 

అంటే పర్యాటకులు స్థానికుల్లో ఒకరిని పెళ్లిచేసుకోవచ్చు. వారితోనే నగరం మొత్తం చుట్టి రావచ్చు. ఇలాంటి జంటలకు హనీమూన్‌ ప్యాకేజీలను కూడా కల్పిస్తున్నాయి. అయితే ఇది నిజమైన పెళ్లి మాత్రం కాదు. డెబోరా అనే పర్యాటకురాలు ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్న కథనంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

‘ఆమ్‌స్టర్‌డ్యాం నగరాన్ని చుట్టిరావడానికి నాకంటూ ఓ తోడు ఉండాలని ఒక్కరోజు పెళ్లికి ఒప్పుకొన్నాను. అక్కడి స్థానికుడిని పెళ్లి చేసుకున్నాను. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒక రోజు తర్వాత వారికి గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోవచ్చు. నచ్చితే వారిని లీగల్‌గా పెళ్లి చేసుకుని వారితోనే ఉండిపోవచ్చు’ అని వెల్లడించారు. 

గంటల తరబడి కాదు.. రోజుల తరబడి

ట్రాఫిక్‌.. ఈ పేరు వినగానే సగంమందికి అలసట వచ్చేస్తుంది. స్కూల్‌, కాలేజీ, ఆఫీస్‌, సినిమా... ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా కొంచెం ముందే బయలుదేరుతాం. ఎందుకంటే ట్రాఫిక్‌లో చిక్కుకుని ఎక్కడ ఆలస్యమైపోతుందేమోనన్న భయం. రోడ్డు ప్రమాదాలు, ప్రముఖుల పర్యటనలు వంటి సందర్భాల్లో ఆయా రోడ్లలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామైపోయి మన సహనానికి పరీక్ష పెడుతుంటాయి. వీటికే మనం హైరానా పడిపోతే కొన్ని దేశాల్లో గంటలు కాదు, ఏకంగా రోజులు తరబడి రోడ్లపైనే ప్రజలు స్తంభించిపోయారు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ప్రపంచంలో ఏర్పడిన అతి భయంకరమైన ట్రాఫిక్‌ జామ్‌ల గురించి తెలుసుకుందామా!


పండగ కోసం...

ఇండోనేషియాలోని బ్రెబస్‌ నగరంలో ప్రధాన హైవే జంక్షన్‌ వద్ద 2016 జూలైలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. స్థానికంగా వారు జరుపుకునే ఓ పండగ కోసం వేలమంది ప్రజలు తమ ఇళ్లకి తరలివెళ్లడంతో సుమారు 21 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్‌ సమస్య మూడు రోజుల పాటు కొనసాగడంతో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు.


వీకెండ్‌ కారణంగా...

ప్రధాన నగరాల్లో సాయంకాలంలో ట్రాఫిక్‌ సమస్యలు ఉండటం సర్వసాధారణం. కానీ బ్రెజిల్‌లోని సౌపాలో నగరం దీనికి భిన్నం. ఇక్కడ ట్రాఫిక్‌ ఏర్పడితే ప్రయాణికులు సినిమా చూసేంతా సమయం ఉంటుంది. అంటే అంతగా ‘సౌ పాలో’లో ట్రాఫిక్‌ సమస్య ఉందని అర్థం. కానీ 2013 నవంబర్‌లో ‘సౌ పాలో’లో భయంకరమైన ట్రాఫిక్‌ ఏర్పడింది. వారాంతపు సెలవు నేపథ్యంలో సుమారు 309 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


33 కిలోమీటర్ల మేర...

1969లో జిమి హెండ్రిక్స్‌ ప్రదర్శిస్తున్న ఉడ్‌స్టాక్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌కి నిర్వాహకులు 50వేల మంది అభిమానులు వస్తారని అంచనా వేశారు. కానీ సుమారు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యేసరికి న్యూయార్క్‌లో 33 కిలోమీటర్ల మేర మూడు రోజుల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ప్రదర్శకులు హెలికాఫ్టర్ల ద్వారా స్థలానికి చేరుకుంటే, సుమారు 5 లక్షల అభిమానులు కార్లని వదిలి కాలినడకతో వెళ్లారు.


12 రోజులపాటు...

2010 ఆగస్టులో బీజింగ్‌-టిబెట్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణికులు సుమారు 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఇది 12రోజులపాటు కొనసాగడం విశేషం. వాతావరణ మార్పులు, ఇతర ఇబ్బందుల వల్ల జరిగిందనుకుంటే పొరపాటే. ఎక్కువగా కార్లు రోడ్లపై రావడంతో ఈ సమస్య తలెత్తింది.


గోడ పడగొట్టాక...

1990 ఏప్రిల్‌లో బెర్లిన్‌ గోడ పడగొట్టడంతో తూర్పు, పశ్చిమ జర్మనీలు అవతల నగరంలో ఉన్న బంధువులు, మిత్రులని కలుసుకోవడానికి బయలుదేరారు. 5లక్షల కార్లు సరిపోయే ప్రదేశంలో 18 మిలియన్ల కార్లు రావడంతో 48 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.


హరికేన్‌ వచ్చి...

హరికేన్‌ రీటా సంభవించడంతో టెక్సాస్‌కు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. 2005 సెప్టెంబర్‌లో సుమారు 2.5 మిలియన్ల మంది ప్రజలు టెక్సాస్‌లోని హౌస్టన్‌ను విడిచి వెళ్లారు. దీంతో రద్దీ ఏర్పడి 48 గంటలపాటు 161 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


వాతావరణం వల్ల...

ఫ్రాన్స్‌లో వాతావరణ ఇబ్బందుల వల్ల 1980 ఫిబ్రవరిలో ఆ ప్రాంతంలోని లియోన్‌ ప్రజలు పారిస్‌కు తరలి వెళ్లారు. దీంతో లియోస్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు 175 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.


201 కిలోమీటర్లు

మంచు తుఫాను కారణంగా 2012 నవంబర్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రధాన రహదారిపై ఈ ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు మూడు రోజుల పాటు 201 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


అన్నీ మూసేయడంతో...

వరల్డ్‌ ట్రేడ్‌ టవర్‌పై ఉగ్రవాదుల దాడి అనంతరం న్యూయార్క్‌లో వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంతెనలు, సొరంగాలను మూసివేసి అత్యవసర వాహనాలు మినహా మిగిలిన వాటిని తనిఖీ చేయడంతో కొన్ని రోజులపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


15 వేల కార్లు

రెండు కారణాల వల్ల 1990లో జపాన్‌ ప్రజలు ఇబ్బంది పడ్డారు. టైఫూన్‌ ప్రమాద హెచ్చరిక జారీచేయడం, సెలవులకి టోక్యో ప్రజలంతా తమ ఇళ్లకి బయలుదేరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పశ్చిమ జపాన్‌లోని హైగా, షిగాల మధ్య సుమారు 15 వేల కార్లు 135 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి.


ద్వారాలు కుదించగా...

సెలవుల కారణంతో మరోసారి ట్రాఫిక్‌ స్తంభించింది. 2015 అక్టోబర్‌లో చైనాలోని బీజింగ్‌ - హాంకాంగ్‌ - మాకా ఎక్స్‌ప్రెస్‌వేలో కొత్త తనిఖీ కేంద్రాన్నిఏర్పాటు చేయడంతో 12 రోజుల పాటు 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. తనిఖీ కేంద్రంలో 50 ద్వారాలని 20 ద్వారాలుగా కుదించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.


మంచు కురిసి...
2011 ఫిబ్రవరిలో మంచు కురవడంతో చికాగోలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఏకంగా 12 గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. హిమపాతం ఎక్కువగా ఉండటంతో 51 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. దీంతో చాలా కార్లు మంచులో కూరుకుపోయాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఈ కేఫ్‌ కునుకు తీసేందుకే..

రాత్రి నిద్ర సరిగా లేకనో, భోజనం తిన్నాకనో పగటిపూట కునుకు రావడం సహజం. అయితే అది ఉద్యోగులను చాలా ఇబ్బంది పెట్టే విషయం. ఒక అరగంట సేపు కునుకు తీద్దామనుకున్నా ఆఫీసులో అలాంటివి అస్సలు కుదరదు. పోనీ ఇంటికెళ్దామా అంటే అరగంట, గంట నిద్ర కోసం ఆఫీసుకు సగం పూట సెలవు పెట్టలేం. అలా ఇబ్బంది పడే ఉద్యోగుల కోసం వారు పనిచేసే కంపెనీల సమీపంలో ‘నెస్కేఫ్‌ స్లీప్‌ కేఫ్‌’ పేరుతో ప్రముఖ కాఫీ బ్రాండ్‌ నెస్కేఫ్‌ వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు కాస్త కునుకు తీయాలనుకుంటే నేరుగా ఈ కేఫ్‌కు వచ్చి కాసేపు పడుకోవచ్చు. ఇందుకోసం కేఫ్‌ నిర్వాహకులు సౌకర్యవంతమైన మంచాలు, పరుపుతో చేసిన ఆరాం కుర్చీలు ఏర్పాటు చేశారు.
 

జపాన్‌లోని టోక్యో నగరంలో ఈ నెస్కేఫ్‌ స్లీప్‌ కేఫ్‌ను గతంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన నెస్కేఫ్‌.. ఇటీవల శాశ్వతంగా అందబాటులోకి తెచ్చింది. ఎవరైనా బయట పనులు చేసి అలిసిపోయినా.. నిద్ర వచ్చినట్టు అన్పించినా ఈ కేఫ్‌ను ఆశ్రయించొచ్చు. ఇందుకోసం కేఫ్‌ ‘న్యాప్‌ కోర్స్‌’, ‘స్లీప్‌ కోర్స్‌’ పేరుతో రెండు రకాల సర్వీసులను అందుబాటులో ఉంచింది. న్యాప్‌ కోర్సులో ఆరాం కుర్చీలో నిద్రపోవచ్చు. అయితే అరగంటకు 750 యెన్లు(రూ. 462) చెల్లించాలి. నిద్ర లేచాక కాంప్లిమెంటరీగా కాఫీ ఇస్తారు. అదే స్లీప్‌ కోర్సులో అయితే ఆరాం కుర్చీలు, లేదా మంచంపై పడుకోవచ్చు. ఇందుకోసం గంటకు 1500 యెన్లు(రూ. 924) వసూలు చేస్తారు. స్లీప్‌ కోర్సులో పడుకునే ముందు కఫైన్‌ లేని కాఫీ.. నిద్ర  లేచాక కఫైన్‌ కలిపిన కాఫీ సర్వ్‌ చేస్తారు. తలగడ ఎంత మెత్తగా ఉండాలి? పడుకునే స్థలంలో ఏ రంగు లైట్లు వెలగాలి? వంటి వాటిని ఎంపిక చేసుకునే వీలుంది. 

అంతేకాదండయ్‌.. మీరు ఎంతసేపు పడుకున్నారు. ఎంత గాఢ నిద్రలో ఉన్నారో తెలిపే  విధంగా స్మార్ట్‌ ఐ మాస్క్‌ను ఇస్తారు. కావాలనుకునే వాళ్లు దాన్ని ధరించి పడుకోవచ్చు. వెళ్లే సమయంలో మాస్క్‌లో నమోదైన రికార్డులను అందజేస్తారు. ఇదివరకు ఈ కేఫ్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన నెస్కేఫ్.. టోక్యోలో శాశ్వతంగా అందుబాటులో తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగానూ వీటిని విస్తరింపజేయాలని నెస్కేఫ్‌ భావిస్తోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఈ గుడికి వెళ్లారంటే ‘బంధం’ తెగినట్లే!

దేవాలయాలకు వెళ్తే సాధారణంగా మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమని, మంచి ఉద్యోగం లభించేలా చేయమని, అందరితో బంధాలు చక్కగా ఉండేలా చూడమని దేవుళ్లను కోరుకుంటాం. కానీ, జపాన్‌లోని ఓ దేవాలయానికి మాత్రం భర్తతో విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడానికే వెళ్తారట. ఎందుకంటే భక్తులు కోరుకున్న బంధాన్ని తెంచడంలో ఆ ఆలయం సుప్రసిద్ధం. ‘యాసుయ్ కోన్పేగు’ అనే ఈ దేవాలయం జపాన్‌లోని ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన జిల్లా హిగషియమలోని క్యోటో నగరంలో ఉంది.

జీవిత భాగస్వామితో విడిపోవాలనుకున్నా, మరో అమ్మాయి/అబ్బాయితో కొనసాగుతున్న తన జీవిత భాగస్వామి ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్‌ పడాలన్నా.. ఒప్పందంతో ఉన్న ఉద్యోగంలో నుంచి తనంతట తానుగా కాకుండా కంపెనీయే సామరస్యంగా బయటకు పంపాలన్నా, వ్యాపార భాగస్వామితో వ్యాపారం ముగించాలన్నా కచ్చితంగా గొడవలు జరుగుతాయి. వాగ్వాదం, ఘర్షణ లాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. కోర్టు కేసులు, ఆర్థిక అడ్డంకులతో ఎన్నో చిక్కులు వచ్చిపడతాయి. ఆ తర్వాత ఒకరి ముఖం మరొకరు చూసుకోలేని పరిస్థితీ ఏర్పడుతుంది. అలాంటివేవీ జరగకుండా ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఆ బంధాలు తెగిపోవాలంటే ‘యాసుయ్‌ కోన్పేగు’ దేవాలయంలో ప్రార్థనలు చేస్తే సరి. 

ఈ దేవాలయంలో పెద్ద బండరాయి ఉంది. దాని మధ్యలో మనిషి దూరేంత రంధ్రం ఉంటుంది. భక్తులు తాము తెంచుకోవాలనుకుంటున్న బంధం వివరాలను చీటిపై రాసి బండరాయి మధ్యలో ఉన్న రంధ్రం నుంచి రెండు సార్లు వెళ్లొచ్చి బండరాయిపై ఉన్న వస్త్రానికి కట్టాలి. తమ బంధాన్ని దూరం చేయమని ప్రార్థించాలి. అలా చేసిన వారికి కచ్చితంగా మొక్కు తీరుతుందని జపాన్‌ ప్రజలు విశ్వసిస్తున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

వూరికి చేయాల్సింది చాలావుంది.. 

వూరికి చేయాల్సింది చాలావుంది.. 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.. వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌.. అన్నారు మహాకవి గురజాడ. అంటే మాటల్తో సరిపెట్టకుండా మనకు చేతనయిన మేలును పదిమందికి పంచిపెట్టడమే. దేశానికి, పుట్టిన వూరికి విధేయులుగా అభివృద్ధిని విస్తరించేలా చేయడం మనకు మరింత శోభనిస్తుంది. ఈ కోవలోనే విదేశాల్లో స్థిరపడినా సొంతవూరి బాగు కోసం తనవంతు సేవ చేయాలనే తపనతో శ్రమిస్తున్నారు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రమేష్‌.

రమేష్‌ పుట్టింది మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్‌ గ్రామం. అదే గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. 1984లో ఏడో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. 1986లో తండ్రి మరణాంతరం సోదరుల సహకారంతో తన చదువును కొనసాగించాడు. ఆర్థిక పరిస్థితి బాగోకపోయినప్పటికీ ఎంటెక్‌ వరకు చదివాడు. 1999లో ఐటీ కొలువు సంపాదించి అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు.

పదకొండు సంవత్సరాల తర్వాత 2010లో తన సొంతూరికి తిరిగి వచ్చాడు.ఎంతో కాలం తర్వాత తిరిగొస్తున్న అతని మనసులో వూరి గురించి ఎన్నో ఆలోచనలు. చిన్నప్పటి పరిస్థితులు నేడు అభివృద్ధి మాటున అడుగంటి వుంటాయని భావించాడు. వూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెంది వుంటుందని ఆశపడ్డాడు. కానీ వూరిలో అడుగుపెట్టగానే అతని ఆలోచనలన్నీ పటాపంచలయ్యాయి. చిన్నతనంలో ఎటువంటి పరిస్థితులైతే అతను ఎదుర్కొన్నాడో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా ఉండటాన్ని గమనించి నివ్వెరపోయాడు.

తను చదివిన పాఠశాల పరిస్థితి మరీ దారుణంగా ఉండటం గమనించాడు. అక్కడి గోడలు శిథిలమై వాటిలో నుంచి పురుగులు రావడం... వాటి మధ్యలో విద్యార్థులు కూర్చొని చదువుకోవడం చూసి చలించిపోయాడు. గ్రామ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన అతను తన గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో మొదటగా ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసి తను చదువుకున్న పాఠశాలకు ఫర్నిచర్‌ సమకూర్చాడు.

చట్టుపక్కల గ్రామాల్లోని రైతులతో మాట్లాడి నష్టపోయిన పత్తి రైతుల గురించి తెలుసుకొన్నాడు. వారికి బాసటగా నిలవటానికి నిర్ణయించుకున్నాడు. పత్తి పంటను వేయొద్దు అని చెప్పడమే కాకుండా టీడీఎఫ్ వారి స‌హ‌కారంతో కంది విత్తనాలు ఉచితంగా గ్రామస్థులకు అందించాడు. చుట్టుపక్కల గ్రామాల సర్పంచులతో మాట్లాడి గ్రామాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని కోరాడు. సాంకేతిక ఒరవడి ఉపయోగించి వ్యవసాయానికి కావాల్సిన సలహాలు, సూచనల కోసం ‘డయల్‌ యువర్‌ విలేజ్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. ఇందులో వ్యవసాయ నిపుణులతో రైతులకు సలహాలను అందించే సౌకర్యాన్ని కల్పించాడు. ప్రభుత్వ సహకారంతో వూరిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నాడు.

‘‘నా వూరికి నేను చేసింది కొంతే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని రమేష్‌ అతని మనసులోని తపన వ్యక్తపరుస్తున్నాడు.

సొంత గ్రామానికి ప్రవాస డాక్టర్‌ సేవ 

సొంత గ్రామానికి ప్రవాస డాక్టర్‌ సేవ సొంత గ్రామానికి ప్రవాస డాక్టర్‌ సేవ 

మల్లాపూర్‌: కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండలం సాతారం గ్రామానికి చెందిన గండ్ర విద్యాధర్‌రావు వృత్తిరీత్యా హృద్రోగ వైద్య నిపుణుడు. గత 15 సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్డియాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడినప్పటికీ సొంత గ్రామానికి ఎంతో కొంత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇప్పటివరకు రూ.64లక్షల వరకు విరాళాలు వెచ్చించి పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని సంవత్సరాల కిందట రూ.4.50లక్షలను వాటాగా ప్రభుత్వానికి చెల్లించగా ప్రభుత్వం మరో రూ.8.50లక్షలను కలిపి మొత్తం రూ.12లక్షలను మంజూరు చేసింది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులను సీసీ రహదారులుగా మార్చారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించేందుకు కంప్యూటర్‌లను అందజేశారు. గదులు చాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు విద్యాధర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా రూ.10లక్షల విలువ గల స్వంత ఇంటిని పాఠశాలకు విరాళంగా ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. దీంతో పాటు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆటస్థలం లేక పడుతున్న ఇబ్బందులను గుర్తించి పాఠశాల సమీపంలో తనకు ఉన్న భూమిలో నాలుగుఎకరాల భూమిని క్రీడాస్థలం కోసం కేటాయించారు. ఇటీవల గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రూ.4.50 లక్షలతో శుద్ధజల ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పచ్చదనంలో గ్రామస్థులను భాగస్వాములు చేయాలన్న తలంపుతో గత ఏడాది తన పుట్టినరోజును పురస్కరించకుని గ్రామంలో 250 మొక్కలను నాటడంతో పాటు వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేసి వాటి సంరక్షణ బాధ్యతను గ్రామస్థులకు అప్పగించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే తలంపుతో ఉన్న విద్యాధర్‌రావు ఆదర్శప్రాయుడే.

సొంతూరి బాగుకోసం... 


సొంతూరి బాగుకోసం... 

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అన్న కరుణామయి మదర్‌థెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారాయన. చిన్నవయసులోనే యూఎస్‌లో ఉద్యోగం సంపాదించి పుట్టిన వూరికి... చుట్టుపక్కల గ్రామాలకు తన వంతు సేవలను అందిస్తూ ఆదర్శనీయంగా నిలుస్తున్నారు. విద్యా దానమే తన ధ్యేయంగా సేవలు అందిస్తున్న నాగార్జున గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

కృష్ణజిల్లా కలిదిండి మండలంలోని పోతుమర్రు గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తిన వెంకటగణేశ్వరరావు, వెంకటవీరమ్మ దంపతుల కుమారుడు బత్తిన నాగార్జున. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పేదరికాన్ని జయించాలన్న సంకల్పంతో పట్టుదలతో ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలన్న తన ఆశయాన్ని నెరవేర్చుకుంటూ... 2010లో యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు.

‘మానవసేవ’ సంస్థ ద్వారా సేవలు 
ఉద్యోగంలో స్థిరపడిన నాటి నుంచి సొంతూరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేయడం ప్రారంభించారు. 2011లో ‘మానవసేవ’ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి 14 మంది మిత్రులను ఆ సంస్థలో సభ్యులుగా చేర్చారు. దీని ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. ప్రతి సంవత్సరం సుమారు రూ 60-70 వేలతో మండలంలోని పోతుమర్రు, గొల్లగూడెం, వెంకటాపురం, గోపాలపురం, దుంపలకోడుదిబ్బ, సున్నంపూడి, ఎస్‌ఆర్పీఅగ్రహారం, పడమటిపాలెం, పరసావానిపాలెం, కోరుకోల్లు, కలిదిండి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు.

సొంతూరి బాగుకోసం... 

రూ.6 లక్షలతో ‘అక్షరాలయ’ నిర్మాణం 
స్వగ్రామమైన గొల్లగూడెంలో అంగన్వాడీ కేంద్రం శిథిలావస్తకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి నాగార్జున ముందుకు వచ్చారు. అప్పటికీ అధికారులు భవన నిర్మాణం చేపట్టడానికి ఆలస్యం చేయడం... ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రమాదకరంగా ఉండటంతో విద్యార్థుల శ్రేయస్సు కోసం భవన నిర్మాణానికి తానే చర్యలు తీసుకున్నారు. దాదాపు రూ.6 లక్షల వ్యయంతో ‘అక్షరాలయ’ పేరుతో కొత్త భవనాన్ని నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 29వ తేదిన నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి అక్టోబర్‌ 5న స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు స్వాధీనం చేశారు.

విద్యా దానమే నాధ్యేయం-నాగార్జున 
పేదరికాన్ని జయించే వజ్రాయుధం విద్య. అలాంటి విద్యను పేదవారికి అందించడమే నాధ్యేయం. ముందుగా స్వగ్రామంలోని పేద విద్యార్థులకు అన్ని విధాలుగా చేయూతనివ్వడం క్రమేపి ఈ సేవలను మండల, నియోజకవర్గం స్థాయిలో విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. స్నేహితులు, బంధువుల సహకారంతో యూఎస్‌లో ఉంటూనే సేవలను అందిస్తున్నాను. ‘మానవసేవ డాట్‌ ఆర్గ్‌(ఓఆర్‌జీ)’ అనే వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాను. నా శక్తి మేరకు విద్యాభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నారు ఎన్నారై నాగార్జున.

మంచి నీరు అందించడంలో ‘రాజీ’ లేదు! 

మంచి నీరు అందించడంలో ‘రాజీ’ లేదు! 

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రాణాధారమైన తాగునీటి కోసం దేశంలో ఎన్నో వూళ్లు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇక స్వచ్ఛమైన మంచినీరు దొరికే పరిస్థితి చాలా చోట్ల కనుమరుగవుతోంది. ఇలాంటి పరిస్థితే ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉండేది. అతికొద్ది మందికి మాత్రమే మంచి నీరు అందేది. మంచినీళ్లు కొనుక్కునే స్థోమత లేక కలుషిత జలంతోనే కడుపు నింపుకొంటున్న వారిని గమనించి ఆమె చలించిపోయారు. తన వూరి వాళ్లకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆ దిశగా నడుం బిగించి ఇప్పుడు రోజూ ఐదారొందల కుటుంబాలకు మంచి నీరు అందిస్తున్నారు ఎన్‌ఆర్‌ఐ రాజీ నడిపల్లి.

అక్కడి వాళ్ల కష్టం చూసి... 
2014లో అమెరికా నుంచి భీమవరం వచ్చినప్పుడు అక్కడ నీళ్లు తాగి ఆమె ఎంతో ఇబ్బంది పడ్డారట. అదే సమయంలో మంచి నీళ్లని కొనుక్కునే స్థోమత లేక కలుషిత జలాన్నే తాగుతున్న చాలా మందిని చూసి బాధేసిందట. దీంతో వూళ్లొ నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీళ్లను అందిస్తే బాగుంటుందని అనుకున్నారు. అదే విషయాన్ని ఆమె భర్త, తండ్రితో పంచుకున్నారు. ‘మంచి ఆలోచన రాజీ.. అలానే చెయ్‌’ అనడంతో ముందుకు సాగారు.

రోజుకి 13 వేల లీటర్లు.. 
అనుకున్నదే తడవుగా పని ప్రారంభించారు రాజీ. తన తండ్రి ఆఫీస్‌ ఉన్న టూటౌన్‌ ప్రాంతంలో మొదటి నీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దానిని నడిపించేందుకు సౌర విద్యుత్‌ను అమర్చారు. సుమారు 3 లక్షలకు పైగా ఇందుకు ఖర్చు చేశారు. చుట్టుపక్కల వాళ్ల నుంచి మంచి స్పందన రావడంతో భీమవరం రైల్వే అధికారులతో మాట్లాడి.. స్టేషన్లో రెండు యంత్రాలను పెట్టించారు. స్వచ్ఛమైన నీరు దుర్వినియోగం కాకుండా గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్డుల ద్వారా సుమారు ఐదారొందల కుటుంబాలు ఉచితంగా ఆ ప్లాంట్‌ నుంచి మంచి నీటిని తీసుకెళ్తున్నారు. ఈ మూడు ప్లాంట్లలో కలిపి రోజుకు 13 వేల లీటర్ల నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నారు రాజీ.

శుద్ధి చేసిన నీటిని ప్రజలకు అందించడం ఒక ఎత్తైతే యంత్రాలను ప్రతి 38 గంటలకు ఒకసారి శుభ్రం చేయటం మరో ఎత్తు. వీటి నిర్వహణకు నెలకు రూ.60 నుంచి 70వేల వరకు ఖర్చు చేస్తున్నారు. తన తండ్రి వద్ద ‘మీ అమ్మాయి ఎంత మంచి పని చేస్తుందో’ అని అందరూ అంటుంటే ఆయన ఆనందం అంతా ఇంతా కాదని రాజీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వూరికోసం గుడి,బడి 


వూరికోసం గుడి,బడి 

ఇంటర్నెట్‌డెస్క్‌: పుట్టిన వూరికోసం కొంతైనా చేయాలని విద్యార్థుల కోసం బడి, భక్తుల కోసం గుడి లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ

కన్నతల్లి రుణం కొంత తీర్చాలని, పుట్టిన వూరికి ఎంతో కొంత సేవ చేయాలని తన సంపాదనలో కొంత ఖర్చుచేస్తు మన్ననలు పొందుతున్నారు. ఒక లక్ష ఉన్నవారు రెండు లక్షలు సంపాదించాలని, కోటి ఉన్నవారు రెండు కోట్లు కావాలని కోరుకుంటున్న ఈ రోజుల్లో తనదైన శైలిలో తన గ్రామం కోసం గుడి, బడి నిర్మించడమే కాకుండా అందుకు తగిన భూమిని సైతం విరాళంగా ఇచ్చారు. పాఠశాల విద్యను అభ్యసించాలంటే పక్కనున్న గ్రామానికి వెళ్లాల్సిన ఇబ్బందిలేకుండా చేశారు. అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తు ఏడాదికి ఒకసారి సొంత గ్రామాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి ఇక్కడి పేదలకు సాయం చేస్తున్న ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన రాజనర్సింగరావు.

వూరికోసం గుడి,బడి జన్నారం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన రాజనర్సింగరావు అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్నారు. ఏడాదికి ఒకసారి సొంతగ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడి పేదలకు బట్టలు పంపిణీ చేయడం, అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. గ్రామంలో ఉన్నత పాఠశాల లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులు పక్కనున్న తాళ్లపేట గ్రామానికి వెళుతున్న విషయం తెలుసుకుని అందుకు ఒక ఎకరం భూమిని విరాళంగా ఇవ్వడమే కాకుండా పాటశాల భవనాన్ని సైతం నిర్మించి ఇచ్చారు. అలాగే గ్రామ సమీపంలో సుమారు ఐదెకరాల భూమిని గుడి కోసం విరాళంగా ఇచ్చారు. వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించి మాన్యంలో 4 ఎకరాల మామిడితోటను నాటించారు. ఈ తోట ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికే చెందేలా తీర్మాణం చేశారు. దీంతో రాంపూర్‌ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్న నేనున్నానని ధైర్యాన్నిచ్చేందుకు ప్రవాసభారతీయుడు పాలెపు రాజనర్సింగరావు ఉన్నారు. ప్రస్తుతం గ్రామంలో ఆయన తమ్ముడు పాలెపు ప్రసాదరావు నివాసం ఉంటున్నారు. ఇక్కడి సమస్యలును అన్నయ్య దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో తగిన చొరవతీసుకుంటున్నారు. అన్నదమ్ముల సేవలను గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.

మాతృభాషపై మమకారం 

పాఠశాలకు రూ.10 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణం 
మాతృభాషపై మమకారం 

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..’ అని అన్నారు రాయప్రోలు సుబ్బారావు. అది మర్చిపోవద్దురా ఏనాడు.. ఓ సినిమా పాటలోని పల్లవిలో వచ్చే పలుకులు ప్రవాస భారతీయుడు ఎర్రంరాజు నాగరాజుకు వేదమంత్రంలా మారాయి. ఈ గడ్డను మర్చిపోకుండా... తాను చదివిన సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలపై మక్కువతో గురువు పేరిట రూ.10 లక్షలు వెచ్చించి ఓ గ్రంథాలయ భవనాన్ని నిర్మించి స్ఫూర్తిగా నిలిచారు.

మాతృభాషపై మమకారం మెదక్‌ జిల్లా చిన్నకోడూరు మండలంలోని చర్లఅంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు దశాబ్దాల కిందట సిద్ధిపేటలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్ది ఉన్నత చదువుల అనంతరం అమెరికాలో ఓ మానసిక వైద్యుడిగా సిర్థపడ్డారు. ప్రముఖ పద్యకవి వేముగంటి నర్సింహాచార్యులు తెలుగు ఉపాధ్యాయుడిగా సిద్ధిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో 1958-63 సంవత్సరాల మధ్య నాగరాజు అదే పాఠశాలలో ఆరు నుంచి పదోవ తరగతి అభ్యసించారు. అయితే ఈ క్రమంలో తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాల మీద ఉన్న మక్కువతో నాగరాజుకు వేముగంటి నర్సింహాచార్యుల మీద అభిమానం ఏర్పడింది. అనంతరం నాగరాజు ఉన్నత చదువులను అభ్యసించి అమెరికాలో మానసిక వైద్యుడిగా స్థిరపడ్డారు. దీంతో తాను చదివిన పాఠశాలకు గురువు పేరిట ఏదైనా చేయాలనే సంకల్పంతో రూ.10 లక్షలు వెచ్చించి పాఠశాలలో ఓ గ్రంథాలయ భవనాన్ని నిర్మింప చేశారు. 2015 డిసెంబర్‌లో ప్రారంభించిన ఈ గ్రంథాలయంలో ఇప్పటికే ఎన్నో రకాల పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ భవనం వారి విజ్ఞానానికి ఉపయోగపడాలనేదే ఆయన ఆకాంక్ష.

సొంతవూరిపై మమకారంతో.. 


సొంతవూరిపై మమకారంతో.. 

వలిగొండ, న్యూస్‌టుడే: విదేశాల్లో స్థిరపడినా సొంతవూరిపై మమకారంతో తమ ప్రజల మేలు కొరుతూ అనేకమంది ఎన్నారైలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. వీరిలో నల్గొండ జిల్లా సుంకిశాలకు చెందిన ఎన్నారై డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి ముందు వరసలో ఉంటారు.ఆయన తన సొంతగ్రామంతో పాటు వలిగొండలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. 
మద్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన అమెరికాలో రెండు ఔషధ కంపెనీలను నెలకొల్పారు. పురిటిగడ్డకు మేలు చేయాలనే తలంపుతో 1996లో శ్రీవెంకటేశ్వర సాంఘిక సంక్షేమ సేవా సమితి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. గ్రామానికే పరిమితం గాకుండా మండల వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్ని విస్తరించారు. సుంకిశాలలోనే దాదాపు రూ.3 కోట్ల నిధులతో ఆలయాల సముదాయాన్ని, పులిగిల్ల, సుంకిశాలలో చెరువుల అభివృద్ధికి రూ.50 లక్షలు, సిమెంటు రోడ్ల ఏర్పాటుకు రూ.45 లక్షలు, వలిగొండలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి స్థల కేటాయింపు, వలిగొండలో రూ.1.20 కోట్ల వ్యయంతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం, రూ.2.50 కోట్లతో కళాశాల భవన నిర్మాణం చేపట్టారు. అందుకే భారత ప్రభుత్వం ఆయన సేవా కార్యక్రమాలను గుర్తించి దశాబ్ధం కిందటే ‘నేషనల్‌ సిటిజన్‌షిప్‌’ అవార్డును ప్రధానోత్సవం చేసింది. రాజకీయాలకతీతంగా ప్రజలు ముందుకు వస్తే అభివృద్ధి వేగవంతం అవుతుంది. గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా మార్చాలని ఉంది. గ్రామస్తులు ఐక్యతతో ఉంటే సాధించవచ్చు. -పైళ్ల మల్లారెడ్డి, సుంకిశాల .

 

సొంతవూరిపై మమకారంతో.. 

 

సొంతవూరిపై మమకారంతో.. 

స్వగ్రామం అభివృద్ధికి కృషి 

స్వగ్రామం అభివృద్ధికి కృషి 

మల్యాల, న్యూస్‌టుడే (కరీంనగర్‌ జిల్లా): మధ్యప్రాచ్యంలోని దుబాయ్‌లో సివిల్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డ మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన కొండపల్కుల రాంమోహన్‌రావు స్వగ్రామం అభివృద్ధి కోసం తన తండ్రి రంగారావుపేర పలు అభివృద్ధి పనులు చేపట్టి ఇతోధిక సేవ చేస్తున్నారు. తాను చదువుకొన్న ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరత తీర్చడానికి రెండు గదులను నిర్మించారు. విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు అందజేశారు. జడ్పీ, ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆటస్థలం లేకపోతే పాఠశాల పక్కనేగల దాదాపు ఎకరా స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు. గ్రామ పంచాయతీ ముందు బస్టాండు నిర్మించి ప్రయాణీకులకు సౌకర్యం కల్పించారు. గ్రామానికి శుద్ధజల కేంద్రం మంజూరుకావడంతో సొంత ఖర్చులతో శుద్ధజల కేంద్రం షెడ్డు నిర్మించి ఇచ్చారు. గ్రామంలో పలు సామాజిక కార్యక్రమాలకు, నిరుపేద కుటుంబాలకు కూడా తనవంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

స్వగ్రామం అభివృద్ధికి కృషి 

ప్రతి ఏటా విరాళం.. ఎందరికో ప్రోత్సాహం 

ప్రతి ఏటా విరాళం.. ఎందరికో ప్రోత్సాహం 

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే (కరీంనగర్‌ జిల్లా):ఆ పాఠశాలలో అ, ఆలు దిద్దిదిన ఆ చేతులే నేడు పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా సాయపడుతున్నాయి. అమెరికాలో స్థిరపడిన ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గుండె అంజనేయులు. లింగవ్వ, వెంకటయ్య నిరుపేద దంపతుల చిన్న కొడుకు అంజనేయులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 21 ఏళ్ల కిందట అమెరికాలో సాఫ్ట్‌వేరు ఇంజనీరుగా స్థిరపడ్డారు. చిన్నతనంలో ఆయన పడిన కష్టాలు పాఠశాల అభివృద్ధి వైపు అడుగులు వేయించాయి. ఏటా విరాళాలు అందిస్తూ ఆధునిక విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. రెండు గదుల నిర్మాణం కోసం 2003లో రూ. 23వేలు అందించారు. 2004లో సౌండ్‌ సిస్టం, డీటీహెచ్‌, ఫ్యాన్‌ల కొనుగోళ్లకు రూ. 32వేలు వితరణ చేశారు. రూ. 21వేలతో తాగునీటి వసతికి సహకరించారు. విద్యార్థులకు బట్టలు, టైల కోసం రూ. 5వేలు పంపించారు. 7వ తరగతిలో ప్రతిభ కనబర్చి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఏటా సైకిళ్లను బహుకరిస్తున్నారు.

ప్రతి ఏటా విరాళం.. ఎందరికో ప్రోత్సాహం 

గ్రామాభివృద్ధికి ఎన్నారైల చేయూత   

పలు అభివృద్ధి పనులకు ఆర్థిక సాయం 
మాజీ సర్పంచి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఔదార్యం 

గ్రామాభివృద్ధికి ఎన్నారైల చేయూత 
 

మద్దికెర, కర్నూలుజిల్లా (న్యూస్‌టుడే): కనిపెంచిన అమ్మ.. పుట్టి పెరిగిన వూరు.. స్వర్గం కంటే ఎక్కువే.. అందుకే ‘జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’ అన్నారు. కన్నతల్లి లాంటి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వారు కంకణబద్ధులయ్యారు. సొంత వూరికి మేలు చేయాలన్న తలంపుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
మద్దికెర మాజీ సర్పంచి అర్దగేరి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కూతురు డాక్టర్‌ వెంకమ్మరెడ్డి చదువు పూర్తయిన అనంతరం నెల్లూరు జిల్లా నిడిగుంటపాలేనికి చెందిన డాక్టర్‌ ఎన్‌. ప్రేమసాగరరెడ్డిని వివాహమాడారు. వారిద్దరూ అమెరికాలో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. అక్కడే అనేక ఆసుపత్రులను నిర్వహిస్తూ ట్రస్టును ఏర్పాటుచేసి వేలాది మందికి విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు. ట్రస్టు తరఫున నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేశారు. 
మద్దికెరలో అభివృద్ధి పనులు 
మద్దికెరలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతో పాటు నిడిగుంటపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించారు. ఆమె తనతో పాటు తన సోదరులు లక్ష్మీనారాయణరెడ్డి, సీతారామిరెడ్డిలను అమెరికా తీసుకువెళ్లడంతో పాటు అక్కడే వారికి తమ ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. లక్ష్మీనారాయణరెడ్డి ఆసుపత్రులకు సీఈఓగా వ్యవహరిస్తుండగా సీతారామిరెడ్డి రేడియాలజి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో 9 వేల మంది ఉపాధి పొందుతున్నారని డాక్టర్‌ వెంకమ్మ చెప్పారు. 

గ్రామాభివృద్ధికి ఎన్నారైల చేయూత 
 మద్దికెరలో శుద్ధజల నీటి పథకం 
సగం వ్యాధులు కలుషిత జలాల వల్లనే సంక్రమిస్తాయని భావించిన డాక్టర్‌ వెంకమ్మరెడ్డి తన సోదరులు లక్ష్మీనారాయణరెడ్డి, సీతారామిరెడ్డి, తన అన్న సచివాలయ విశ్రాంత ఉద్యోగి ప్రభాకరరెడ్డిల సహకారంతో గ్రామంలోని మండల పరిషత్‌ కార్యాలయం దగ్గర రూ.12.5 లక్షలతో శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు. స్థానికంగా బీసీ వసతిగృహానికి రూ. 5 లక్షలు, మహిళా భవన నిర్మాణానికి గానూ రూ4 లక్షలు, సిమెంటు రహదారి నిర్మాణానికి రూ.లక్ష, స్థానికంగా సాయిబాబా ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాల కోసం మరో రూ.10 లక్షలు, గ్రామంలో మరో శుద్ధజల కేంద్రం దాని నిర్వహణకు అవసరమైన జనరేటర్‌ కొనుగోలుకు, వాటర్‌షెడ్‌ పథకం కింద ప్రజల తరఫున విరాళంగా మరో రూ.2 లక్షలు అందజేశారు. గ్రామంలో సౌర విద్యుత్తు వీధి దీపాల కోసం వారు విరాళం అందించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.