close
బ్లూమింగ్‌టన్‌లో స్వాతంత్ర్య వేడుకలు

బ్లూమింగ్‌టన్‌: ఇండియానాలోని బ్లూమింగ్‌టన్‌లో ఈ నెల 24న 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎంసీఐఏ ఆధ్వర్యంలో ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంసైతం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులేనని, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకొనేవారికి ఎంసీఐఏ సభ్యత్వం ఉండాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. బాలలకు ఉపన్యసించేందుకు అవకాశం కల్పిస్తున్నామని, ఎనిమిది నుంచి పదహారేళ్ల వయసు వారు ఇందులో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. వివరాలు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంసీఐఏ సభ్యత్వం ఉన్నవారికి ఉచితంగా, సభ్యత్వం లేనివారు 15 డాలర్లు చెల్లించి రిజిస్టర్‌ చేసుకోవచ్చని తెలిపారు. 
స్వాతంత్ర్య దినోత్సవం, ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా వేడుకలు  24వ తేదీ శనివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8గంటల వరకూ జరగనున్నాయి. బ్లూమింగ్‌టన్‌లో మిల్లర్‌ పార్క్‌ పెవీలియన్‌ ఎదురుగా ఉన్న మిల్లర్‌ పార్క్‌ బ్యాండ్‌ స్టాండ్‌ ఇందుకు వేదిక కానుంది.

వార్తలు / కథనాలు

మరిన్ని