close
చికాగోలో కూచిపూడి నృత్య ప్రదర్శన

చికాగో: చికాగో ఆంధ్రా అసోసియేషన్‌(సీఏఏ) ఆధ్వర్యంలో అర్ధనారీశ్వరం పేరిట సెప్టెంబర్‌ 7న కూచిపూడి నృత్య ప్రదర్శన జరగనుంది. పద్మభూషణ్‌ డా.వెంపటి చిన్న సత్యం కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ, చెన్నైకి చెందిన 30 మంది కళాకారుల బృందం ఈ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ ప్రదర్శనను అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఏటీఏ), శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఉత్తర అమెరికా(ఎస్‌ఏపీఎన్‌ఏ), ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌(టీటీఏ)ల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చికాగో ఆంధ్రా అసోసియేషన్‌ అధ్యక్షుడు పద్మారావు అప్పలనేని ఓ ప్రకటనలో తెలిపారు. 30 మంది కళాకారుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ప్రస్తుతం ఈ బృందం యూఎస్‌, కెనడాల్లోని 50 నగరాల్లో ప్రదర్శన ఇస్తోంది. ఇందులో భాగంగా చికాగోలో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే ఒక గ్రామం పేరు మీద వచ్చిన ఈ నృత్య కళను ప్రపంచానికి తెలియజేయడం తమ బాధ్యత అని పద్మారావు తెలిపారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని