close
విజయవంతంగా తాల్ ప్రీమియర్‌ లీగ్

 

లండన్‌: తెలుగు అసోసియేషన్ ఆప్‌ లండన్‌(తాల్‌) సంస్థ 2019 సంవత్సరంలో తాల్ ప్రీమియర్‌ లీగ్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇంపీరియల్ కాలేజ్‌ ఆఫ్ లండన్‌లో ఆగష్టు 17న నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంటు ఫైనల్లో బ్లూ రేంజర్స్ విజేతగా నిలవగా, కూల్ క్రూయిజర్స్‌ రెండో స్థానం, ఆల్ స్టార్స్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. సునీల్ నాగండ్ల మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌, బెస్ట్ బౌలర్‌ గా నిలిచారు. ఎక్కువ పరుగులతో సురేందర్ వలి బెస్ట్ బ్యాట్స్‌మ్యాన్‌గా నిలిచారని లీగ్ నిర్వాహకులు వెల్లడించారు.  

భారత్‌, బ్రిటన్‌ జాతీయ గీతాలను ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించి తాల్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాల్ స్పోర్ట్స్‌ ట్రస్టీ మురళీ తాడిపత్రి విజేతలకు అభినందనలు తెలిపారు. బ్రిటన్‌లోని తెలుగువారికి చేయూతనిచ్చే ఉద్దేశంతో ‘యునైట్ చెరిష్ అండ్ షేర్’ నినాదంతో  2005లో తాల్ ఏర్పడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాల్‌ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు  శ్రీధర్‌ మేడిశెట్టి(ఛైర్మన్‌), శ్రీధర్‌ సోమిశెట్టి(ట్రెజరర్‌), నిర్మలా ధావలా, భారతి కందుకూరి, శ్రీనివాస్ రెడ్డి కోన్‌రెడ్డి, మల్లేశ్ కోట, రాజేశ్ తోలేటి, గిరిధర్ పుట్లూర్‌, మురళి తాడిపత్రి, అడ్వైజర్లు రాములు దాసోజు, రామానాయుడు బొయల్లా, వేణు మాధవ్‌ కవర్తపు, ఎస్‌వైపీసీ ప్రసాద్‌రావు, బాపుజీ వెలగపూడి, సంజయ్‌ భైరాజు, ధర్మవటి నిస్తాల, సత్యేంద్ర పగడాల, హేమ మాచర్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని