Latest Telugu News, Headlines - EENADU
close
ఉల్లాసంగా ‘లాహిరి.. లాహిరి.. లాహిరిలో’

టెక్సస్‌: ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) వారి సహకారంతో వనితా వేదిక కమిటీకి చెందిన శ్రీలక్ష్మి మండిగ ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సస్‌లో జులై 28న ‘లాహిరి..లాహిరి..లాహిరిలో నౌకావిహారం కార్యక్రమాన్ని ఉల్లాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ టాంటెక్స్‌ 2019 అధ్యక్షుడు చినసత్యం వీర్నపు ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. అనంతరం లూయిస్‌ విల్‌ లేక్‌లో ‘లాహిరి..లాహిరి..లాహిరిలో..’ అనే పాటకు మహిళలందరూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చక్కటి ఆటలు ఆడుతూ బింగో, అంత్యాక్షరి, ఆట పాటలు, ఇంకెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ నాలుగు గంటలు పాటు సరస్సులో విహరిస్తూ ఆనందడోలికల్లో మునిగిపోయారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులను చూసేందుకు భారత్‌ నుంచి వచ్చిన తల్లిదండ్రలు సైతం వారి పిల్లలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరుతూ టాంటెక్స్ బృందాన్ని వారు అభినందించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని