close
ఉత్సాహంగా ‘తెలుగు సాహితీ వైభవం’

డాలస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంయుక్త ఆధ్వర్యంలో జూలై 21న ఆహా! ఈహీ! ఒహో! తెలుగు సాహితీ వైభవ కార్యక్రమాన్ని డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. దాదాపు 200లకు పైగా సాహితీ ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ గేయరచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తానా కార్యవర్గ సభ్యుడు లోకేష్ నాయుడు జొన్నవిత్తులని సభకు పరిచయం చేశారు. సాహితి వేముల, సింధూర వేముల ఆలపించిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తానా బోర్డు కార్యదర్శి మురళీ వెన్నం నూతనంగా ఎన్నికైన తానా కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు. రచయిత జొన్నవిత్తుల రామలింగెశ్వర రావు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తానా, టాంటెక్స్ సంయుక్తంగా మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
 

తానా పూర్వ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జొన్నవిత్తులతో నిర్వహించిన “చమత్కార చతుర్ముఖ పారాయణం” అనే సాహిత్య కార్యక్రమం అందరినీ అలరించింది. ఇది తన 17వ అమెరికా పర్యటన అని.. తానా, టాంటెక్స్‌ లాంటి అనేక తెలుగు సంస్థలు తనకిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చాగోష్ఠిలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, బాపు, రమణ, వేటూరి సుందరరామ్మూర్తితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. పద్యాల రూపంలో తెలుగు భాషా వైభవాన్ని ఆయన వర్ణించిన తీరు ఆహుతులను ముగ్ధులను చేసింది. సభకు విచ్చేసిన జ్యోతిష శాస్త్ర నిపుణులు డా. జంధ్యాల భాస్కర శాస్త్రి  జొన్నవిత్తుల కవితా చాతుర్యాన్ని కొనియాడారు. 
 

ఈ కార్యక్రమానికి విచ్చేసిన తానా పూర్వాధ్యక్షులు డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట, డా. ప్రసాద్ తోటకూరలను తానా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతిష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, రావు కాల్వల, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాథం పులిగండ్ల, ఎం.వి.ఎల్‌.ప్రసాద్, టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, రాజా రెడ్డి, గీతా దమ్మన్న, ఆర్.కె పండిటి, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, టాటా అధ్యక్షులు విక్రం జంగం, నాటా పూర్వాధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొరపాటి, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ సతీష్ రెడ్డితో సహా ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు సహకరించిన వివిధ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలకు తానా, టాంటెక్స్‌ కమిటీ బృందం ధన్యవాదాలు తెలియజేశాయి. 
సాహితీ సమావేశం అనంతరం మహాత్మా మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సస్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూరతో కలసి అమెరికాలోనే అతి పెద్దదైన 18 ఎకరాల పార్క్‌లో నెలకొల్పిన మహాత్మాగాంధీ స్మారక ప్రాంతాన్ని జొన్నవిత్తుల సందర్శించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని