close
అమెరికాలో హిందూ పూజారిపై దాడి

న్యూయార్క్‌: అమెరికాలోని గ్లెన్‌ ఓక్స్‌ ప్రాంతంలోని శివ శక్తి పీఠం పూజారి హరీశ్ చందర్ పూరీపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. పీఠం సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న హరీష్‌ చందర్‌పై వెనుకనుంచి వచ్చిన అతను విచక్షారహితంగా కొట్టాడు. దీంతో ఆ స్వామీజీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అక్కడి హిందూ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు దాడికి పాల్పడ్డ సెర్జియా గువెయ(52) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

మరోవైపు ఇది విద్వేషపూర్వకంగా చేసిన దాడి అని హరీశ్‌ చందర్‌ శిష్యులు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ సమయంలో నిందితుడు ‘ఇది తమ ప్రాంతం’ అంటూ నినాదాలు చేసినట్టు సమాచారం. దాడిలో తాను తీవ్రంగా గాయపడ్డానని.. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నానని హరీశ్‌ చందర్‌ తెలిపారు. అయితే ఇది విద్వేషపూరితంతో చేసిన నేరమా.. కాదా.. అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని