close
నాట్స్‌ ఆధ్వర్యంలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

ఫ్లోరిడా: అమెరికాలో ఉన్న తెలుగువారికి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) టెంపా నగరంలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అట్లాంటా, ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ టెంపా బే, నాట్స్ టెంపా బే విభాగాలు సంయుక్తంగా ఈ క్యాంప్‌ని ఏర్పాటు చేశారు. దాదాపు 350 మందికి పైగా ఈ సేవలను వినియోగించుకున్నారు. వీసా పునరుద్ధరణకు సంబంధించి 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికెట్, లీగల్ డాక్యుమెంట్లకు సంబంధించి 50 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించి ఇంత మంచి కార్యక్రమాన్ని నాట్స్ చేపట్టినందుకు స్థానిక తెలుగువారు నాట్స్  బృందాన్ని అభినందించారు. టెంపా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త రాజేశ్ కాండ్రు నేతృత్వంలో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం సహకరించిన నాట్స్‌ వాలంటీర్లను సంఘం సభ్యులు అభినందించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని