close
ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

అట్లాంటా: అమెరికాలోని భారతీయుల వైద్యుల సంఘమైన ఆపి (అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ ) 37వ వార్షిక సదస్సు అట్లాంటాలోని జార్జియా వరల్డ్‌ కాంగ్రెస్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ గంగసాని శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జులై 3 నుంచి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సును విశ్వయోగి విశ్వంజీ జ్యోతి వెలిగించి
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అట్లాంటాలోని భారత ప్రభుత్వ దౌత్య అధికారి డాక్టర్‌ స్వాతి కులకర్ణితో పాటు అమెరికా ప్రభుత్వ అధికారులు, అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొని డాక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జులై 4న ఇషా వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఆధ్యాత్మిక సారం వ్యాపారం కాకూడదని ఉద్బోధించారు. ఆరోగ్యానికి చిహ్నాలైన వైద్యులు మరింత ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఇటీవల వైద్యులు, వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితిని యుద్ధప్రాతిపదికన సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఆపి కన్వెన్షన్‌, సైంటిఫిక్‌ అసెంబ్లీలో సీఎంఈ (కంటిన్యూ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) తరగతులు, ప్రొఫెషనల్‌, బిజినెస్‌, ఉమెన్స్‌ ఫోరమ్‌ లాంటి సదస్సులతో పాటు, విక్రయశాలలు, శంకర్‌ మహాదేవన్‌ సంగీత విభావరి, వైద్యులు ప్రదర్శించిన నృత్యనాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సదస్సులో అమెరికాలోని పలు నగరాల నుంచి తరలివచ్చిన వైద్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 


 

వార్తలు / కథనాలు

మరిన్ని