close
తానాలో కృష్ణా జిల్లా వాసి

తిరువూరు: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కు జరిగిన ఎన్నికల్లో  క్రిష్ణా జిల్లా తిరువూరుకు చెందిన శ్రీని యలవర్థి ఒహియొ వ్యాలి ప్రాంతీయ కోఆర్డినేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జులై 6న శ్రీని ప్రమాణస్వీకారం చేశారు. 2019-2021 మధ్య ఈయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రతిష్ఠాత్మకమైన తానా సంస్థకు ఎన్నిక కావడం పట్ల తిరువూరు వాసులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీని యలవర్థి అమెరికా లో ఐటీ నిపుణుడిగా స్థిరపడి, సామాజిక సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని