close
తాల్‌బాలల దినోత్సవ సంబరాలు


లండన్: నెహ్రు జయంతి, యూనివర్సల్‌ చిల్ర్డన్స్‌ డే పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) చిన్నారులు 12వ తాల్‌ బాలల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది చిన్నారులు పాల్గొన్నారు. వారిలో 150 మంది చిన్నారులు వివిధ కళలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. తాల్ సాంస్కృతిక కేంద్రం విద్యార్థులు తెలుగు పద్యాలు, భరత నాట్యం ప్రదర్శనలు ఇచ్చారు. చిన్నారులు జాతీయ నాయకులు, పురాణ పాత్రలలో అలరించారు. ఆటలపోటీలు, చిత్రలేఖనంలో పాల్గొన్న చిన్నారులందరికీ తాల్ తరఫున జ్ఞాపికలు అందజేశారు.
తాల్ ట్రస్టీ తోలేటి రాజేశ్‌, కమిటీ సభ్యులు కస్తూరి కిశోర్‌, గాదంశెట్టి నవీన్‌, కొత్తకోట శ్రీదేవి, షర్మిల రెడ్డి, మేడిశెట్టి అశోక్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. మిగిలిన పిల్లలు కూడా తాల్ సాంస్కృతిక కేంద్రంలో చేరాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని