close
యూఏఈ పౌరులకు ‘వీసా ఆన్‌ అరైవల్‌’

దిల్లీ: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)తో సంబంధాలను మరింత పటిష్ఠం చేసే దిశగా భారత్‌ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా యూఏఈ పౌరులకు ‘వీసా ఆన్ అరైవల్‌’ సౌకర్యం కల్పిస్తోంది. ఈ సేవలు హైదరాబాద్‌, ముంబై, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అందుబాటులో ఉండనున్నాయి. శనివారం నుంచే ఈ సేవలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. వ్యాపారం, పర్యాటకం, సదస్సులు, వైద్యం నిమిత్తం భారత్‌కు వచ్చే వారికి ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగానే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ అవకాశం వినియోగించుకోవాలనుకునేవారు ఇప్పటికే కనీసం ఒక్కసారైనా భారత్‌కు ఇ-వీసా లేదా సాధారణ వీసా పొంది ఉండాలన్నారు. తొలిసారి వచ్చేవారు మాత్రం ఇ-వీసా లేదా పేపర్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. భారత్‌ ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌లకు ‘వీసా ఆన్‌ అరైవల్‌’ సౌకర్యం కల్పిస్తోంది. అలాగే 170 దేశాలకు చెందిన పౌరులకు ఇ-వీసా వసతి అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో మరింత సమాచారం లభిస్తుంది.  https://indianvisaonline.gov.in/visa/visa-on-arrival.html

వార్తలు / కథనాలు

మరిన్ని