
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఐకాస కార్మికులు చేపడుతున్న సమ్మె సెగ విదేశాలకూ పాకింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని వాషింగ్టన్లో ఆదివారం జరిగిన తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్) 20వ వార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులను సమాయత్తం చేయాలని టీడీఎఫ్‌కు సూచించారు. సమావేశం మధ్యలో కొందరు ఎన్నైరైలు పైకి లేచి ప్లకార్డులు ప్రదర్శించారు. ‘సేవ్ ఆర్టీసీ..సేవ్ ఆర్టీసీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. ఎన్నారైల ఆందోళన మధ్యే వినోద్ ప్రసంగించారు. ఈ వేడుకలకు వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, డాక్టర్ దేవయ్య తదితరులు హాజరయ్యారు.