close
లండన్‌లో సంబరంగా దీపావళి వేడుకలు

లండన్: లండన్‌లోని ట్రాఫల్గర్‌ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌ దీపావళి కమిటీ(దిల్‌) భాగస్వామ్యంతో మేయర్‌ ఆఫ్‌ లండన్‌ నిర్వహించిన ఈ వేడుకలకు లండన్‌ తెలుగు అసోసియేషన్‌(తాల్‌) సభ్యులు నేతృత్వం వహించారు. దిల్‌ కమిటీలో భారతదేశానికి చెందిన పలు సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో కూడిన విభిన్న సభ్య సంస్థలు ఉంటాయి. వారంతా లండన్‌లో భారతీయ కార్యక్రమాలను సామరస్యంగా జరుపుకొంటారు. ఇందులో తాల్ కూడా భాగంగా కలిసి పనిచేస్తోంది.

ఈ సందర్భంగా కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన లండన్‌ నగర మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకొంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, గణనాథుని స్తుతితో మొదలై లక్ష్మీ హారతితో ముగిసింది. తాల్‌ సాంస్కృతిక బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వహించగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. మొత్తం 35వేల మంది పాల్గొన్న ఈ వేడుకల్లో తాల్‌ తరపున 20 మందికి పైగా వలంటీర్లు తమ సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో తాల్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌ సోమిశెట్టి, కోశాధికారి నిర్మల దావాల, భారతి కందుకూరి, శ్రీనివాస రెడ్డి కొండ్రెడ్డి, కోట మల్లేష్‌, తోలేటి రాజేష్, గిరిధర్‌ పుట్లూరు, మురళి తాడిపర్తి బోర్డు సలహాదార్లు డా.రాములు దాసోజు, రామానాయుడు బోయల్ల, డా.వేణుమాధవ్‌ కవర్తపు, డా.ఎస్‌వైపీసీ ప్రసాదరావు, డా.బాపూజీ రావు వెలగపూడి, సంజయ్‌ బిరాజు, ధర్మావతి నిష్టల, సత్యేంద్ర పగడాల, హేమ మాచర్ల, శ్రీధర్‌ మేడిచెట్టి తదితరులు పాల్గొన్నారు.  

వార్తలు / కథనాలు

మరిన్ని