close
అమెరికాలో ఘనంగా దీపావళి సంబరాలు

డాలస్: గుంటూరు ఎన్నారై అసోసియేషన్‌ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు కొమ్మినేని ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రవాసాంధ్రులు సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించి, బాణసంచా కాలుస్తూ ఆనందోత్సాహాల నడుమ దీపావళిని జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దీపావళి పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు కలిసి ఎంతో ఆనందంగా జరుపుకొనే పండుగ దీపావళి అని అన్నారు. చెడు మీద మంచి గెలుపునకు సూచికంగా దీపావళి పండుగను జరుపుకొంటున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయం, అక్రమాలపై సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకొంటున్నామని గుంటూరు ఎన్నారై అసోసియేషన్‌ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు కొమ్మినేని అన్నారు. 

ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటల పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల తెలుగు వంటకాలు  తయారు చేశారు. అనంతరం ఈ పోటీలో గెలుపొందిన వారికి అసోసియేషన్‌ ప్రతినిధులు బహుమతులు అందజేశారు. క్రాంతిలత, పుల్లారావు మందడపు, శ్రీదేవి, వెంకట శివరావమ్మ, విష్ణు, విద్య, రిషిక్, శ్రిత, యోగేష్, మానస,  పల్లపోతు, అనిల్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని