close
ట్రంప్‌ దీపావళి సందడి చూశారా?

వీడియో ట్వీట్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: శ్వేత సౌధంలో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సందడి చేశారు. దీపాలు వెలిగించి కాసేపు ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఈ మేరకు ఒక వీడియోను ఆయన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీంతోపాటు ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘ అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, జైనులు, సిక్కులు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు. చీకటిని చీల్చుకు వచ్చే వెలుతురుకి దీపావళి ప్రతీక. అదే విధంగా దుష్ట సంహారం జరిగిన తర్వాత చేసుకునే పండగ ఇది. చెడుపై మంచి గెలిచిన శుభతరుణం. దుర్మార్గంపై సన్మార్గం విజయం సాధించిన సమయం. ఈ పవిత్ర పండుగ నాడు అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి. మీ కుటుంబ సభ్యులు, బంధువులకు అంతా శుభమే జరగాలి’ అని అన్నారు. మరో ప్రకటనలో ‘మా పరిపాలనా యంత్రాంగం అమెరికాలో ఉన్న విదేశీయుల సంప్రదాయాన్ని గౌరవిస్తుంది. వారి హక్కులు, నమ్మకాలు, గౌరవాలను కాపాడుతుంది. ఈ ఏడాది మీ అందరి జీవితాల్లో ప్రేమ, వెలుగులు, శాంతి నిండాలని మేం కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.


వార్తలు / కథనాలు

మరిన్ని