close
అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు ఆహ్వానం

ఓర్లాండో: తెలుగు భాష, సాహిత్యాలపై మక్కువతో నవంబర్‌ 2, 3 తేదీల్లో అమెరికాలోని ఓర్లాండో నగరంలో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సునిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వంగూరి చిట్టెన్‌ రాజు తెలిపారు. వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభకు హాజరుకావాలని భాషాభిమానులను కోరారు. ఓర్లాండో మహా నగర తెలుగు సంఘం ఈ సదస్సును నిర్వహిస్తోందని తెలిపారు. గత 21 సంవత్సరాల్లో ఇలా సదస్సు నిర్వహించడం ఇది 11వ సారి అని, ఫ్లోరిడా రాష్ట్రంలో నిర్వహించడం తొలిసారని పేర్కొన్నారు. తెలుగు భాష, సాహిత్యాన్ని అందరూ అభిషలించాలనే ఉద్దేశంతో తలపెడుతున్న ఈ కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక సాయం అందించాలని దాతలను కోరారు.

వార్తలు / కథనాలు

మరిన్ని