close
సౌదీ రోడ్డు ప్రమాద బస్సులో 9 మంది భారతీయులు

మదీనా: సౌదీ అరేబియాలో గత బుధవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం తొమ్మిది మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. వీరిలో ఇద్దరు గాయపడ్డట్లు.. వారు ప్రస్తుతం జెద్దాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మరో ఏడుగురి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. తొమ్మిది మంది వివరాలతో కూడిన జాబితాను ట్విటర్‌లో ఉంచారు. మరింత సమాచారం కోసం జెద్దాలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు రెండు హెల్ప్‌లైన్ నెంబరు ఏర్పాటు చేశారు.

సౌదీలోని మదీనా ప్రావిన్స్‌లో అల్‌ అఖల్‌ సెంటర్‌ వద్ద యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు.. భారీ వాహనాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. పవిత్ర క్షేత్రం మక్కా సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మొత్తం 35మంది విదేశీ యాత్రికులు మరణించారు. అయితే వీరిలో ఎవరైనా భారతీయులు ఉన్నారా అన్న విషయంపై వెంటనే ఎలాంటి సమాచారం లభ్యమవ్వలేదు. దీనిపై అక్కడి రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగమంత్రి జైశంకర్‌ ప్రకటించారు. తాజాగా బస్సులో మొత్తం 9మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి రాయబార కార్యాలయం వెల్లడించింది. 

వార్తలు / కథనాలు

మరిన్ని