close
మక్కాలో తప్పిపోయిన హైదరాబాద్‌ మహిళ

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు చెందిన మహిళ ఒకరు మక్కా యాత్రకు వెళ్లి తప్పిపోయారని, ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్‌ తెలిపారు.ఈ నెల 9న యాత్రకు వెళ్లిన సయ్యద్‌ వాజిహా వాజిద్‌ అనే ఆమె అల్‌ హరామ్‌ మసీదు వద్ద తప్పిపోయినట్లు కుటుంబీకుల ద్వారా తెలిసిందన్నారు. తగిన చర్యల కోసం సంబంధిత మంత్రి, కార్యాలయ సిబ్బందికి ట్విటర్‌ సమాచారం అందించామన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని